అంబానీ కోడలు హ్యాండ్ బ్యాగ్ ఖర్చుతో అపార్ట్‌మెంట్ కొనొచ్చు
ఇంతకుముందు పెళ్లి వేడుకలో అంబానీ కాబోయే కోడలు రాధిక మర్చెంట్ ధరించిన హ్యాండ్ బ్యాగ్ ఖరీదు గురించి బోలెడంత చర్చ సాగింది. ఈ హీర్మేస్ కెల్లీ బ్యాగ్ విలువ 65 లక్షలు!
ఆసియా నంబర్- 1 ధనవంతుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఈ జైలైలో, తన స్నేహితురాలు, ఎంటర్ ప్రెన్యూర్ రాధికా మర్చెంట్ తో జూన్ నెలలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే గుజరాత్ జామ్ నగర్ లో మూడు రోజుల ప్రీవెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. అయితే ఈవెంట్ ఏదైనా కానీ రాధికా మర్చెంట్ ధరించే ఖరీదైన దుస్తులు, ఆభరణాలు, హ్యాండ్ బ్యాగుల గురించి అహూతుల్లో ఆసక్తికర చర్చ సాగింది. ఇంతకుముందు పెళ్లి వేడుకలో అంబానీ కాబోయే కోడలు రాధిక మర్చెంట్ ధరించిన హ్యాండ్ బ్యాగ్ ఖరీదు గురించి బోలెడంత చర్చ సాగింది. ఈ హీర్మేస్ కెల్లీ బ్యాగ్ విలువ 65 లక్షలు! అంటూ ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ మీడియా ఫోటోగ్రాఫర్ ఖరీదును వెల్లడించడంతో అందరూ నోరెళ్లబెడుతున్నారు.
పట్టుమని పది పెన్నులు, పిన్నులు అయినా ఇందులో పడతాయో లేదో.. కానీ ఇంత చిన్న బ్యాగ్ కోసం 65లక్షలు ఖర్చు పెడుతుందా? దీంతో ఒక అపార్ట్ మెంట్ కొనుక్కోవచ్చు! అంటూ నెటిజనుల్లో గుసగుసలు మొదలయ్యాయి. నిజానికి ఇంతకుముందు ముంబైలో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) ప్రారంభోత్సవంలోనే ఇదే బ్రాండ్ లో మరో విలక్షణమైన బ్యాగ్ తో రాధిక మర్చెంట్ కనిపించింది. అప్పుడు తన చేతికి ధరించిన హీర్మేస్ కెల్లీ మార్ఫోస్ బ్యాగ్ ఖరీదు గురించి నెటిజనుల్లో విస్త్రతంగా చర్చ సాగింది. హీర్మేస్ బ్యాగ్‌లు చౌకగా రావు సరే కానీ.. ఈ ప్రత్యేకమైన హీర్మేస్ కెల్లీ మార్ఫోస్ బ్యాగ్ రూ. 52,30,000 (సుమారు RM 281,355) ధర ట్యాగ్ ని కలిగి ఉంది అని హిందీ మీడియా వెల్లడించింది.
ఇది రాచరికపు దర్పానికి చిహ్నం. మినియేచర్ బ్యాగ్‌ల కొత్త ట్రెండ్‌కు అనుగుణంగా ఈ చిన్న బ్యాగ్ షహబ్-దురాజీ నుండి రూపొందినది. నిజానికి హీర్మేస్ కెల్లీ మార్ఫోస్ బ్యాగ్ ఎందుకు ఇంత ఖరీదైనది? అంటే ఇది కేవలం బ్యాగ్ మాత్రమే కాదు.. ఆభరణం కూడా.. అని చెబుతున్నారు. ఈ ఐకానిక్ బ్యాగ్‌ని పునర్నిర్మించవచ్చు.. లేదా అవసరానికి అనుగుణంగా మార్చవచ్చు. దానిని శరీరం అంతటా స్లింగ్ చేయడానికి బదులుగా మెడ, మణికట్టు, వేళ్లకు ఆభరణంగా ఉపయోగించవచ్చు. రాధికా మర్చంట్ ఎంచుకున్నది స్టెర్లింగ్ సిల్వర్‌లోని హెర్మెస్ కెల్లీ సాక్ బిజౌ చైన్... అని కూడా హిందీ మీడియా విశ్లేషించింది.
హెర్మేస్ జ్యువెలరీ క్రియేటివ్ డైరెక్టర్ పియరీ హార్డీ ఇంతకు ముందు ఒక ప్రకటనలో వ్యాఖ్యానిస్తూ.. ``కెల్లీ బ్యాగ్ అవసరం మేర ఫంక్షనల్ భాగాలను ఎలివేట్ చేస్తుంది.. సైడ్ స్ట్రాప్‌లు .. టర్న్‌లాక్, ప్లేట్ .. నాలుగు స్టడ్‌లతో కూడిన ఎలిమెంటల్ క్లాస్ప్.. కెల్లీ జ్యువెలరీ ఎలివేషన్ బ్యాగ్ ప్రత్యేకత అని కూడా ఒక కథనం పేర్కొంది. ఈ బ్యాగ్ కి ఉండే అందమైన గొలుసును భుజానికి పట్టీగా ఉపయోగించవచ్చు. అలాగే చక్కటి ఆభరణంగా ధరించవచ్చు.. అని కూడా వెల్లడించారు.
హీర్మేస్ కెల్లీ బ్యాగుల చరిత్ర:లగ్జరీ ఫ్యాషన్‌కి వీరాభిమానులైతే హీర్మేస్ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. హీర్మేస్ దాని డిజైనర్ బ్యాగ్‌ల శ్రేణికి `కెల్లీ` అని పేరు పెట్టింది. దిగ్గజ అమెరికన్ నటి గ్రేస్ కెల్లీ, మొనాకో ప్రిన్స్ రైనర్ IIIని వివాహం చేసుకున్న తర్వాత యువరాణి కెల్లీగా మారింది. ఆమె 1950 లలో తన హీర్మేస్ బ్యాగ్‌ని ఉపయోగించి ఫోటోగ్రాఫర్‌ల నుంచి తన బేబీ బంప్‌ను దాచిపెట్టింది. ఈ విషయం వార్తల్లో అంశం అవ్వడంతో ఇది హిర్మేస్ బ్రాండ్ కి పాపులారిటీని పెంచింది.