వివేక్ రామస్వామి: ప్రచారానికి 10 సత్యాలు... ఇష్టమైనవి 3 సినిమాలు!

వచ్చే ఏడాది నవంబర్ లో జరుగనున్న అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి వైట్ హౌస్ లో అడుగుపెట్టాలని భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి తీవ్రంగా కష్టపడుతున్న సంగతి తెలిసిందే.

Update: 2023-09-14 06:30 GMT

వచ్చే ఏడాది నవంబర్ లో జరుగనున్న అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి వైట్ హౌస్ లో అడుగుపెట్టాలని భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి తీవ్రంగా కష్టపడుతున్న సంగతి తెలిసిందే. తనదైన వ్యూహాలతో, తనవైన ప్రచారాస్త్రాలతో ఆయన ముందుకు కదులుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా తన ప్రచారానికి 10 సత్యాలు అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ఇదే సమయంలో తనకు ఇష్టమైన సినిమాల పేర్లు పంచుకున్నారు.

అవును... రిప‌బ్లిక‌న్ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం ప్రచారం మొద‌లుపెట్టిన వివేక్ రామస్వామి... మీడియా ఇంటర్వ్యూలు, చర్చా వేదికలపై వివిధ అంశాల గురించి తన ఆలోచనలను పంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా థామస్ జెఫెర్సన్ మాటల నుండి తాను ప్రేరణ పొంది.. 10 సత్యాలను నోట్ చేసుకున్నాని చెబుతూ.. అవి పంచుకున్నారు వివేక్ రామస్వామి. వాటి వివరాలు ఇప్పుడు చూద్దా!

"దేవుడు నిజమైనవాడు" అనేది రామస్వామి చెప్పే మాట. ప్రపంచంలోనే పెద్ద క్రైస్తవ దేశాల్లో ఒకటిగా ఉన్నచోట ఈ మాట చాలా బలంగా పనిచేస్తుందని అంటారు! ఇదే సమయంలో "ఈ లోకంలో రెండే లింగాలు ఉన్నాయి" అని చెబుతున్నారు రామస్వామి. ఈ సమయంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువా అనే భావన మానసిక రోగం అని స్పష్టం చేస్తున్నారు.

వేడి వల్ల కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ మంది చలి ఉష్ణోగ్రతల వల్ల మరణిస్తున్నారని చెబుతున్న రామస్వామి... "మానవ వికాసానికి శిలాజ ఇంధనాలు అవసరం" అని కొన్ని వక్కానిస్తున్నారు. అనంతరం "జాత్యాహంకారం ఎంత ప్రమాదమో... జాత్యాహంకార వ్యతిరేక ఉద్యమం కూడా అంతే ప్రమాధం" అని చెబుతున్నారు రామస్వామి.

ఇదే సమయంలో " బహిరంగ సరిహద్దు సరిహద్దు కాదు" అని వ్యాఖ్యానిస్తున్నారు రామస్వామి. అంటే... దేశ సరిహద్దుల్లో జరిగేవి మాత్రమే యుద్దాలు కాదని, అంతకంటే ముఖ్యంగా దేశ అంతర్గత యుద్ధాల పరిష్కారం మరింత ముఖ్యమని చెప్పే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఇది అక్రమ వలసదారులు, మానవ అక్రమ రవాణా మాత్రమే కాదని.. సాయుధ కార్టెల్ ముష్కరులు కూడా నేరుగా మన మాతృభూమిపై దాడి చేస్తున్నారని ఆయన అంటున్నారు.

ఇదే సమయంలో తమ పిల్లలు ఏమి చదవాలి, ఏ రంగంలో రాణించాలనే విషయాల్లో తల్లితండ్రులకే హక్కు ఉంటుంది కానీ... ఉపాధ్యాయ సంఘాలకో, యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కో కాదని రామస్వామి స్పష్టం చేశారు. ఇదే సమయంలో "న్యూక్లియర్ ఫ్యామిలీ అనేది మానవాళికి తెలిసిన గొప్ప పాలనా విధానం" అని రామస్వామి స్పందించారు. అదే విధంగా... "పెట్టుబడిదారీ విధానం ప్రజలను పేదరికం నుండి పైకి లేపుతుంది" అని రామస్వామి అభిప్రాయపడ్డారు.

ఇదే సమయంలో ఈ సీరియస్ నోట్ అనంతరం... తనకు ఇష్టమైన మూడు సినిమాలపై కూడా తాజాగా స్పందించారు వివేక్ రామస్వామి. అవి వరుసగా... గ్లాడియేటర్, ఇంటర్‌ స్టెల్లార్, ది డార్క్ నైట్ అని ఆయన తెలిపారు. ఇవి తనకు ఆల్ టైం ఫేవరెట్ సినిమాలని రామస్వామి చెప్పారు.

కాగా... 2000 ల్లో వచ్చిన గ్లాడియేటర్ ఒక పురాణ చారిత్రక నాటకం కాగా, 2008 విడుదలైన డార్క్ నైట్.. సూపర్ హీరో జానర్ కాగా... 2014 లో వచ్చిన ఇంటర్ స్టెల్లార్.. ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా. ఇవి మూడూ తనకు ఆల్ టైం ఫేవరెట్స్ అని వివేక్ రామస్వామి వెల్లడించారు.

Tags:    

Similar News