విదేశీ విద్యార్థుల చ‌దువుకు పెద్ద‌పీట‌.. ప‌నిగంట‌లు త‌గ్గించిన కెనడా!

భార‌త్ స‌హా ప‌లు దేశాల నుంచి కెన‌డా వెళ్లి విద్య‌ను అభ్య‌సించే విద్యార్థుల విష‌యంలో ఆ దేశ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది

Update: 2024-05-01 07:39 GMT

భార‌త్ స‌హా ప‌లు దేశాల నుంచి కెన‌డా వెళ్లి విద్య‌ను అభ్య‌సించే విద్యార్థుల విష‌యంలో ఆ దేశ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సాధార‌ణంగా చ‌దువుకునేందుకు వెళ్లి వారు.. తమ సొంత కాళ్ల‌పై నిల‌బ‌డేలా.. ఆర్థిక వ‌న‌రులు సంపాయించుకునేలా.. అమెరికా, కెన‌డా దేశాలు.. ప్రోత్స‌హిస్తున్నాయి. అంటే.. విద్య కోసం వెళ్లిన విద్యార్థులు.. చ‌దువుకుంటూనే.. ఖాళీ స‌మ‌యంలో ప‌నిచేసుకునేందుకు.. డ‌బ్బులు సంపాయించుకునేందుకు అవ‌కాశం ఉంది.

ఈ విధానం కార‌ణంగా.. వారు త‌మ కుటుంబాల‌పై ఆధార‌ప‌డే ప‌ర‌స్థితిని త‌గ్గించాల‌నేది ప్ర‌ధాన ఉద్దేశం. అయితే.. త‌ర్వాత కాలంలో ఆయా దేశాల్లో పెరిగిన ఉద్యోగిత కార‌ణంగా.. ఇది మరింత ప్రాధాన్యం సంత రించుకుంది. ఈ నేప‌థ్యంలో విశ్వ‌విద్యాల‌యాలు, కాలేజీల్లో చ‌దువుకునే వారిని ప‌నిచేసుకునే ప్రోత్స‌హి స్తున్నారు. ఈ విష‌యంలో అమెరికా స‌హా కెన‌డా ప్ర‌భుత్వం భిన్న‌మైన విధానాలు అనుస‌రిస్తున్నాయి. ముఖ్యంగా బ్రిట‌న్‌లో ప‌నిగంట‌ల నిబంధ‌న ఉంది.

అంటే.. ఒక విద్యార్థి అక్క‌డ చ‌దువుతూ.. ప‌నిచేయాల‌ని అనుకుంటే.. వారానికి ఇన్ని గంట‌లే ప‌నిచేయా ల‌నే నిబంధ‌న ఉంది. క‌రోనా ముందు వ‌ర‌కు.. ఇది 30 గంట‌లుగా ఉండ‌గా.. క‌రోనా త‌ర్వాత‌.. పెరిగిన ఉద్యోగుల ల‌భ్య‌త లేమి కార‌ణంగా.. అప్ప‌టి ట్రూడో ప్ర‌భుత్వం ఈ ప‌నిగంట‌ల‌ను 40 వ‌ర‌కు పెంచారు. అంటే.. విద్యార్థులు ఒక‌వైపు చ‌దువుతూనే.. వారానికి 40 గంట‌లు.. (అంటే.. రోజుకు 5.30 గంట‌లు) ప‌నిచేసుకునే అవ‌కాశం ఏర్ప‌డింది.

కానీ, ఇప్పుడు దీనిని 24 గంట‌ల‌కు ప‌రిమితం చేశారు. ఈ మేర‌కు కెనడా వలసలు, శరణార్థులు, పౌరసత్వ వ్యవహారాల శాఖ మంత్రి మార్క్‌ మిల్లర్ ప్ర‌క‌ట‌న చేశారు. అయితే.. ఇది సెప్టెంబ‌రు త‌ర్వాత నుంచి అమ‌ల్లోకి రానుంది. అప్ప‌టి వ‌ర‌కు వారానికి 40 గంట‌ల ప‌నివిధానమే కొన‌సాగ‌నుంది. ఇక్క‌డ ప్ర‌భుత్వం చెబుతున్న కీల‌క విష‌యం.. ఎక్కువ గంట‌లు(రోజుకు 5.30 గంట‌లు) ప‌నిచేయ‌డం ద్వారా విద్యార్థులు అలిసిపోతున్నార‌ని.. త‌ద్వారా విద్య‌పై దృష్టి త‌గ్గుతోంద‌ని. ఇది కూడా నిజ‌మే కావ‌డంతో ఈ నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేసింది. మొత్తానికి ప‌నిగంట‌ల మార్పు అయితే జ‌రిగింది. దీనిని విద్యార్థులు ఎలా అర్ధం చేసుకుంటార‌నేది చూడాలి. కాగా, మ‌న దేశం నుంచి అమెరికాలో విద్య‌ను అభ్య‌సిస్తున్న వారు.. 12 ల‌క్ష‌ల మంది ఉంటే.. కెన‌డాలో ఈ సంఖ్య 3 ల‌క్ష‌ల పైచిలుకు మాత్ర‌మే ఉంది.

Tags:    

Similar News