ఎఫ్.బీ.ఐ. డైరెక్టర్ గా భారత సంతతి వ్యక్తి... పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్!
అమెరికా అధ్యక్ష ఎనికల్లో ఘన విజయం సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అమెరికా అధ్యక్ష ఎనికల్లో ఘన విజయం సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సమయంలో తన ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సమయంలో మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి కేటాయించారు.
అవును.. అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్.. ప్రమాణ స్వీకారానికి ముందు తన టీమ్ ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా... భారత సంతతికి చెందిన వ్యక్తులకు కీలక పదవులు కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో మస్క్ తోపాటు వివేక్ రామస్వామికి డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిసియెన్సీ (డోజ్) బాధ్యతలు అప్పగించారు.
ఇదే సమయంలో... కోల్ కతాలో జన్మించిన స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ఆర్థికవేత్త భట్టాచార్యను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్.ఐ.హెచ్) కు తదుపరి డైరెక్టర్ గా నియమించారు. ఈ నేపథ్యంలో తాజాగా కశ్యప్ పటేల్ (కాష్ పటేల్)ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ.) డైరెక్టర్ గా ప్రకటించారు.
ఈ సందర్భంగా స్పందించిన ట్రంప్... కాష్ గొప్ప న్యాయవాది అని, పరిశోధకుడు అని, అమెరికాలో అవినీతి నిర్మూలనకు, న్యాయాన్ని గెలిపించేందుకు నిరతరం శ్రమిస్తున్నారని ప్రశంసించారు. ఆయన ఇప్పటివరకూ అమెరికా ప్రజలకు ఎంతో అండగా నిలిచారని.. ఆయన రాకతో ఎఫ్.బీ.ఐ.కి పునర్ వైభవం తీసుకొస్తామని ట్రంప్ పేర్కొన్నారు.
కాగా.. కశ్యప్ కుటుంబ మూలాలు గుజరాత్ లో ఉన్నాయి. అతడి తల్లితండ్రులు ఈస్ట్ ఆఫ్రికాలో పెరిగారు. అయితే.. ఉగాండలో నియంత ఈదీ ఆమిన్ బెదిరింపుల కారణంగా కశ్యప్ తండ్రి అమెరికాకు వలస వచ్చారు. ఈ క్రమంలో 1980లో న్యూయార్క్ లోని గార్డెన్ సిటీలో కశ్యప్ జన్మించారు.
యూనివర్శిటీ ఆఫ్ రిచ్ మాండ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. యూనివర్శిటీ కాలేజ్ లండన్ లో న్యాయవిద్యను అభ్యసించారు. అనంతరం మియామీ కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్ గా పనిచేసి వివిధ హోదాల్లో సేవలందించారు. ట్రంప్ విధేయుడిగా కశ్యప్ కు పేరుందని అంటారు. ఈ క్రమంలో అత్యంత కీలకమైన ఎఫ్.బి.ఐ. డైరెక్టర్ గా నియమించబడ్డారు.