ఛలో యూఎస్... మారుతున్న భారతీయుల ఆలోచనలు గమనించారా?

ప్లస్ టు పూర్తి చేసిన వయసులోనే యూఎస్ కు పంపించాలనే ఆలోచన ఇప్పుడు జిల్లా కేంద్రాలు, చిన్న చిన్న నగరాలకు కూడా విపరీతంగా వ్యాపిస్తుందని చెబుతున్నారు.

Update: 2024-09-13 17:30 GMT

మేనేజ్మెంట్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలటిక్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్... కోర్సు ఏదైనా మాస్టర్స్ మాత్రమే కాదు.. ఇప్పుడు బ్యాచులర్ డిగ్రీ కూడా అమెరికాలో చేయాలనే ఆలోచన భారతదేశంలో చిన్న చిన్న ప్రాంతాలకు కూడా విస్తరిస్తుందని అంటున్నారు నిపుణులు.

అవును... ఒకానొక సమయంలో పిల్లలను యూఎస్ కు పంపించాలంటే అది ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖ వంటి గ్రేటర్ సిటీస్ లలోనే ఎక్కువగా కనిపించేది. మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉండే తల్లితండ్రులే ఎక్కువగా ఈ దిశగా ఆలోచన చేసేవారు! అయితే... ఇప్పుడు కాలం మారింది, తల్లి తండ్రుల ఆలోచనా విధానం కూడా మారుతుందని అంటున్నారు.

ప్లస్ టు పూర్తి చేసిన వయసులోనే యూఎస్ కు పంపించాలనే ఆలోచన ఇప్పుడు జిల్లా కేంద్రాలు, చిన్న చిన్న నగరాలకు కూడా విపరీతంగా వ్యాపిస్తుందని చెబుతున్నారు. ఇందులో చాలా మంది పిల్లలకు అమెరికాలోనే పట్టభద్రులు కావాలనే కోరిక పెరుగుతుందని.. వారిలో మెజారిటీ యువతకు అక్కడే సెటిల్ అవ్వాలనే ఆలోచనా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

ఈ క్రమంలోనే చాలా మంది మాస్టర్స్ కోసం మాత్రమే అమెరికా వైపు చూస్తుంటారని.. ఫలితంగా అనంతరం అక్కడ సెటిల్ అవ్వడంపై ఆసక్తి చూపిస్తారని అంటున్నారు. అయితే... ఆ లెక్కలు మారాయని, ఆ ఆలోచన మారిందని.. ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్ స్టడీస్ కోసం కూడా అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని, చిన్న చిన్న ప్రాంతాలకూ విస్తరిస్తుందని చెబుతున్నారు.

మరోపక్క డిగ్రీలు చేసే విషయంలో భారతీయ విద్యార్థులు ఎంచుకుంటున్న టాప్ 10 కోర్సుల గురించి పరిశీలిస్తే... ఈ జాబితాలో మేనేజ్మెంట్ కోర్సులు టాప్ ప్లేస్ లో ఉన్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా... సుమారు 17% మంది భారతీయులు మేనేజ్మెంట్ కోర్సులవైపు ఆకర్షితులవుతున్నారని అంటున్నారు.

అనంతరం.... సుమారు 16% మంది భారతీయులు డేటా సైన్స్ ను ఇష్టపడుతున్నారని అంటున్నారు. అదేవిధంగా... తర్వాత స్థానాల్లో 15% మంది భారతీయ విద్యార్థులు కంప్యూటర్స్ సైన్స్, 13% మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలటిక్స్ కోర్సులపై ఆసక్తి చూపిస్తున్నారని చెబుతున్నారు. పలు వెబ్ సైట్స్ లలో భారతీయ విద్యార్థులు సాగించిన సెర్చ్ ఆధారంగా ఈ వివరాలు చెబుతున్నారు!!

Tags:    

Similar News