ప్రవాసీ.. ధన హస్తవాసి.

భారత ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం ప్రవాసులు ఏప్రిల్‌ లో సుమారు 1 బిలియన్‌ డాలర్లను డిపాజిట్ చేశారు. గత సంవత్సరం ఏప్రిల్ లో 150 మిలియన్ డాలర్లను డిపాజిట్ చేయడం గమనార్హం.

Update: 2024-06-22 11:44 GMT

ఏ దేశానికైనా ప్రజలే సంపద.. అందలోనూ యువత మరీ ముఖ్యం. వారు సాధించే ఆర్థిక ప్రగతి దేశ ఎకానమీని పటిష్ఠ పరుస్తుంది. ప్రపంచంలో తలెత్తుకునేలా చేస్తుంది. విదేశీయులనూ పెట్టుబడులు పెట్టేందుకు ఆకర్షిస్తుంది. జనాభా తక్కువగా ఉన్న దేశాలు ఇప్పుడు పిల్లలను కనండి అని యువతను ప్రోత్సహిస్తున్నారంటే.. దేశ ప్రగతిలో ప్రజల పాత్ర ఎలాంటిదో తెలుకోవచ్చు. ఈలెక్కన భారత దేశం చాలా లక్కీ. 150 కోట్ల జనాభాతో అలరారుతున్న గొప్ప ప్రజాస్వామ్య దేశం మనది. అందులోనూ అత్యంత గొప్ప ప్రవాస సంతతి ఉన్న దేశం కూడా భారత్ అనడంలో సందేహం లేదు.

ఎక్కడున్నా భారత మూలం ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు, ఇంగ్లండ్ నుంచి న్యూజిలాండ్ దాకా భారత సంతతి హవా అంతాఇంతా కాదు. ఒకప్పుడు 200 ఏళ్లు మనల్ని పాలించిన ఇంగ్లండ్ కు ఇప్పడు ప్రధాని మన వాడే. కాగా, కొన్నాళ్లుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడిదొడికులు ఎదుర్కొంటోంది. ఓ దశలో మాంద్యంలోకి జారుకుంటుందా? అనే అనుమానం కలిగింది. అయితే, అదేమీ లేదని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రవాస భారతీయులు తమ ప్రత్యేకత చాటారు.

భారత ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం ప్రవాసులు ఏప్రిల్‌ లో సుమారు 1 బిలియన్‌ డాలర్లను డిపాజిట్ చేశారు. గత సంవత్సరం ఏప్రిల్ లో 150 మిలియన్ డాలర్లను డిపాజిట్ చేయడం గమనార్హం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ జా డేటా ప్రకారం, ప్రవాసుల డిపాజిట్లలో పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థ ప్రత్యేకతను చాటుతోంది. కాగా, ప్రవాసుల కోసం దేశంలో మూడు కీలక డిపాజిట్ పథకాలు ఉన్నాయి - విదేశీ కరెన్సీ నాన్ రెసిడెంట్ (బ్యాంక్); నాన్-రెసిడెంట్ బాహ్య రూపాయి ఖాతా, నాన్-రెసిడెంట్ సాధారణ డిపాజిట్ పథకం. ఏప్రిల్‌ లో ఎన్‌ఆర్‌ఇ (ఆర్‌ఎ) పథకంలో 583 మిలియన్ డాలర్లు, ఎఫ్‌సిఎన్‌ఆర్(బి) లో 483 మిలియన్ డాలర్లు డిపాజిట్ చేశారు. కాగా, కరోనా సమయంలో వీరి డిపాజిట్లు 131 బిలియన్ డాలర్ల నుంచి 142 బిలియన్ డాలర్లకు పెరిగాయి.

Read more!

గరిష్ఠానికి విదేశీ మారక నిల్వలు భారత ఫారెక్స్ నిల్వల జీవితకాల గరిష్ఠ స్థాయి 655.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే.. 4.3 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఈ ఏడాది ప్రపంచ రెమిటెన్స్‌ లో భారత్ వాటా 15.2 శాతం. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక రెమిటెన్స్‌ లను స్వీకరించే దేశం మనదే. విదేశీ మారక నిల్వల పెరుగుదల ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతను ప్రతిబింబిస్తుంది. రూపాయి అస్థిరంగా మారినప్పుడు దానిని స్థిరీకరించడానికి ఆర్బీఐకి ఇది సాయపడుతుంది.

Tags:    

Similar News

eac