భారతీయ సంతతి తల్లి నుంచి కమలా హరీస్ నేర్చుకున్నదిదే!

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ కమలా హారీస్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-10-09 03:55 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ కమలా హారీస్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో పలు పోడ్ కాస్ట్ లను ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వీటిలో ప్రజలకు హామీలిస్తూ, ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ, తనపై పడిన విమర్శలకు సమాధానాలు చెబుతూ.. తన వ్యక్తిగత విషయాలనూ పంచుకుంటున్నారు.

అవును... ఇటీవల ఓ పోడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో యూఎస్ వైఎస్ ప్రెసిడెంట్, డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారీస్.. బాల్యంలో తన పెంపకం.. భారతీయ సంతతికి చెందిన తల్లి శ్యామలా గోపాలన్ అందించిన విలువల గురించి పంచుకున్నారు. ఈ సందర్భంగా తన తల్లిని బలమైన, స్వతంత్ర వ్యక్తిగా హరీస్ అభివర్ణించారు.

ఇదే సమయంలో... తన పిల్లల స్వీయ అవగాహన, జవాబుదారీతనాల విలువలను నింపుతూ పెంచారని.. మనం ఎలా భావిస్తున్నామో వ్యక్తపరచగలగడం ప్రాముఖ్యతను ఆమె ఖచ్చితంగా ఆకట్టుకుందని హారీస్ తెలిపారు. ఇక తాను ఇరవై ఏళ్ల వయసులో ఒక సమస్యతో ఇంటికి వచ్చినప్పుడు.. తాను ఏమి చేయగలను అనేదానికి బదులుగా మీరు ఏమి చేశారు అని ప్రశ్నించిందని తెలిపారు.

ఈ విధంగా ఇతర తల్లులకు పూర్తి భిన్నంగా అన్నట్లుగ తన తల్లి ప్రతిస్పందించేవారని.. కాలక్రమేణా దాని వెనకున్న శక్తివంతమైన సందేశాన్ని అర్ధం చేసుకున్నామని హరీస్ జోడించారు. ఇదే ఇంటర్వ్యూలో తనకు జీవసంబంధమైన పిల్లలు లేరంటూ రిపబ్లికన్ గవర్నర్ సారా హుకాబీ శాండర్స్ చేసిన వ్యాఖ్యలపైనా హారీస్ ఘాటుగా స్పందించారు.

జీవసంబంధమైన పిల్లలు లేకపోవడం వల్ల ఆమె అణుకువగా ఉండరంటూ ఆర్కాన్సాస్ గవర్నర్ సారా హకబీ శాండర్స్ చేసిన వ్యాఖ్యలపై గాటుగా స్పందించారు హారిస్. ఇది 1950నాటి కాలం కాదని.. కుటుంబం అనేది రకరాలుగా ఏర్పడుతుందని.. అటు రక్తం ద్వారా, ఇటు ప్రేమ ద్వార తనకు కుటుంబం కలిగి ఉందని హరీస్ స్పష్టం చేశారు.

తన భర్త డగ్ ఎమ్ హోఫ్ కు ఉన్న ఇద్దరు పిల్లలకు సవతి తల్లిగా ఉండటం నిజంగా తనకు పెద్ద ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు తెలిపారు. తన భర్త మొదటి వివాహం నూంచి వచ్చిన జీవిసంబంధమైన పిల్లలు కోల్, ఎల్లా లను తాను మరణం వరకూ ప్రేమిస్తానని హారీస్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే తన తల్లి తనకు నేర్పిన పాఠాల గురించి వ్యాఖ్యానించారు!

Tags:    

Similar News