'తానా'లో రూ.30 కోట్ల స్కామ్ వ్యవహారంలో కీలక పరిణామం!
అమెరికాలోని తెలుగు కమ్యునిటీ "తానా" (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) కు సంబంధించిన నిధుల మళ్లింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
"తానా" ఫౌండేషన్ కు సంబంధించిన నిధుల దుర్వినియోగం వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఫౌండేషన్ మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు సుమారు నాలుగు మిలియన్ డాలర్ల నిధులను తన సొంత సంస్థకు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి! ఈ సమయంలో ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
అవును... అమెరికాలోని తెలుగు కమ్యునిటీ "తానా" (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) కు సంబంధించిన నిధుల మళ్లింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. తానాకి కాలిఫోర్నియా జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ సందర్భంగా... అన్ని పత్రాలు, డిజిటల్ డేటాను కోర్టుకు సమర్పించాలని కోరింది.
కాగా... గత ఏడాది డిసెంబర్ లో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తానా మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు ‘తానా’కు విరాళాలుగా వచ్చిన నిధుల నుంచి సుమారు నాలుగు మిలియన్ డాలర్ల నిధులు తన సొంత కంపెనీ బృహత్ టెక్నాలజీస్ కు ట్రాన్స్ ఫర్ చేసినట్లు చెబుతున్నారు.
ఇలా శ్రీకాంత్ తన కంపెనీ బృహత్ టెక్నాలజీస్ కు రూ.30 కోట్లకు పైగా నిధులను మళ్లించిన వ్యవహారం సుమారు రెండేళ్లుగా విడతలవారీగా కొనసాగుతుందని తెలియడం దాతలకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇంతలో శ్రీకాంత్ తానా ఫౌండేషన్ ట్రస్టీ పదవికి రాజీనామా చేసి.. తానా అకౌంట్ కు $1 మిలియన్ తిరిగి చెల్లించినట్లు చెబుతున్నారు.
మిగిలిన మొత్తన్ని డిసెంబర్ 15లోగా తిరిగి చెల్లిస్తామని నాడు చెప్పినట్లు చెబుతున్నారు. ఈ ఘటన తెలుగు ఎన్నారైల్లో షాకింగ్ హాట్ టాపిక్ గా మారింది. కేవలం ఓ వ్యక్తి ఇతర సభ్యులు ఎవరికీ తెలియకుండా సుమారు 4 మిలియన్ డాలర్లను దారి మళ్లించడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా కోర్టు నోటీసులు పంపించింది.
ఈ సందర్భంగా తానాకు సంబంధించిన మొత్తం సమాచారంతో కోర్టు ముందు హాజరుకావాలని.. ఆ సమాచారాన్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ)కు మెయిల్ చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా.. ఫిజికల్ డాక్యుమెంట్లతో పాటు సాఫ్ట్ కాపీలకు తీసుకురావాలని కోరింది. దీంతో... ఈ విషయం అమెరికా తెలుగు కమ్యునిటీలో చర్చనీయాంశంగా మారింది.