ఇప్పటికే రూ.600 కోట్లు పెనాల్టీ కట్టారు... ఎన్నారైలు జాగ్రత్త!

ఇందులో భాగా ఆ మొత్తం సుమారు రూ. 600 కోట్లు అని ప్రకటించింది. అయినప్పటికీ ఆధార్‌ - పాన్‌ లింక్‌ చేయని వారు 11.48 కోట్ల మంది ఉన్నారని కేంద్రం తెలిపింది.

Update: 2024-02-21 05:39 GMT

పన్నులను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ని ఆధార్‌ తో లింక్ చేయడాన్ని తప్పనిసరి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆధార్‌ ను పాన్‌ తో లింక్ చేయడంతోపాటు, పాన్ అప్లికేషన్‌ లు, పన్ను రిటర్న్‌ లలో ఆధార్‌ ను లింక్ చేయడం అవసరం. ఈ సమయంలో ఎన్నారైలు చాలా మంది ఈ విషయంలో నిర్లక్ష్యం వహించారని తెలుస్తుంది.

అవును... ఆధార్ తో పాన్ ను గడువులోగా లింక్ చేయకపోతే, పాన్ కార్డ్ పని చేయడం ఆగిపోతుంది.. ఫలితంగా ఎలాంటి పన్ను రిటర్న్ చేయలేరు. అవి లింక్ చేయకుంటే మీరు మరింత పన్ను చెల్లించాల్సి రావచ్చు! వాస్తవానికి ఆధార్ - పాన్ లను లింక్ చేయడానికి ప్రభుత్వం అదనపు సమయం ఇచ్చింది.. కానీ ఎన్నారైలతో సహా చాలా మంది ఇప్పటికీ దీన్ని చేయలేదని తెలుస్తుంది!

ఈ క్రమంలో ఇచ్చిన గడువు లోపు ఆధార్‌ - పాన్‌ లింక్‌ చేయని వినియోగదారుల నుంచి కేంద్రం పెనాల్టీల రూపంలో భారీ మొత్తంలో వసులూ చేసింది. ఇందులో భాగా ఆ మొత్తం సుమారు రూ. 600 కోట్లు అని ప్రకటించింది. అయినప్పటికీ ఆధార్‌ - పాన్‌ లింక్‌ చేయని వారు 11.48 కోట్ల మంది ఉన్నారని కేంద్రం తెలిపింది.

ఉచితంగా ఆధార్‌ - పాన్‌ లింక్‌ చేసుకునేందుకు జూన్‌ 30 - 2023కి చివరి తేదీగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే... ఈ గడువు తేదీ ముగిసిన తర్వాత ఎవరైతే ఆధార్‌ - పాన్‌ లింక్‌ చేయాలనుకుంటారో వాళ్లు తప్పని సరిగా అదనపు రుసుము కింద రూ.1000 చెల్లించి అప్‌ డేట్‌ చేసుకోవచ్చు.

ఆదాయపు పన్ను చట్టం - 1961 ప్రకారం పాన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఆధార్ నంబర్ తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాన్ - ఆధార్ గడువు తేదీ గతేడాది 2023, జూన్ 30తోనే ముగిసింది. అయితే, ఇప్పటికీ ఆధార్ – పాన్ అనుసంధానం చేసుకోవచ్చు. అయితే, రూ.1000 పెనాల్టీ చెల్లించి అధికారులకు ఈ వివరాలు వెల్లడిస్తే 30 రోజుల్లోగా పాన్ కార్డును పునరుద్ధరిస్తారని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ పేర్కొంది!

Tags:    

Similar News