మారిన సమీకరణాలు.. కమలాకు తులసి షాక్

మొన్నటివరకు డెమొక్రటిక్ పార్టీలో ఉండి.. ఇప్పుడు రిపబ్లిక్ పార్టీలోకి చేరటంతో మనమ్మాయి మీద మనమ్మాయే వ్యతిరేకించే కొత్త సీన్ చోటు చేసుకుంది.

Update: 2024-08-27 04:34 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్త సీన్ చోటు చేసుకుంది. గతంలో డెమోక్రటిక్ పార్టీలో ఉన్న భారత మూలాలు ఉన్న మనమ్మాయి తులసీ గబ్బార్డ్ తాజాగా రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపటమే కాదు.. ట్రంప్ అభ్యర్థిత్వానికి తన సంపూర్ణ మద్దతు తెలిపిన వైనం ఆసక్తికరంగా మారింది. డెమొక్రటిక్ అభ్యర్థిగా భారత మూలాలు ఉన్న కమలా హారిస బరిలో ఉన్న సంగతి తెలిసిందే. మొన్నటివరకు డెమొక్రటిక్ పార్టీలో ఉండి.. ఇప్పుడు రిపబ్లిక్ పార్టీలోకి చేరటంతో మనమ్మాయి మీద మనమ్మాయే వ్యతిరేకించే కొత్త సీన్ చోటు చేసుకుంది.

అంతేకాదు.. కమలా హారిస్ మీద తీవ్ర విమర్శలు గుప్పించిన తులసి.. అఫ్టానిస్గాన్ నుంచి అమెరికా సైనిక బలగాలు వైదొలిగిన విధానాన్నీ తప్పుపట్టారు. తాజాగా డెట్రాయిట్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ తో కలిసి వేదికను షేర్ చేసుకున్న తులసి.. కమలా హరీస్ ను టార్గెట్ చేయటం కొత్త రాజకీయ పరిణామంగా చెబుతున్నారు. శాంతి సాధనకోసం శత్రువులు.. నియంతలు.. మిత్రులు.. భాగస్వాములు.. ఇలా ఎలాంటి తేడా లేకుండా అందరినీ కలిపే ధైరయం ట్రంప్ ఒక్కరు మాత్రమే చేయగలరంటూ పొగిడేశారు.

అదే సమయంలో డెమొక్రాట్ల విధానాల్ని తప్పు పట్టారు. డెమొక్రాట్ల హయాంలో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతున్నాయని విమర్శించిన తులసి.. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో అణుయుద్ద ముప్పు పొంచి ఉందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. నిజానికి 2020 డెమొక్రటిక్ పార్టీ తరఫు అధ్యక్ష అభ్యర్థిగా తులసి నిలిచారు.అప్పట్లో కమలా హారిస్ తో డిబేట్ లో పాల్గొన్న వేళ.. ఆమె పని తీరును తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చివర్లో రేసు నుంచి తప్పుకున్న ఆమె.. బైడెన్ కు తన మద్దతు ప్రకటించారు. ఇటీవల రిపబ్లికన్ల పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆమె.. తాజాగా ట్రంప్ విధానాల్ని ఆమె పొగిడేశారు. తాజా పరిణామంతో అమెరికాఅధ్యక్ష ఎన్నికల్లో మనమ్మాయిల పాత్ర మరింత కీలకం కానుందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News