యూఎస్ లో భారతీయ తండ్రీ కొడుకుల విషాధ ముగింపు!
అవును... అమెరికాలోని జార్జియాలోని ఫోర్సిత్ కౌంటీకి చెందిన రాజీవ్ కుమార స్వామి అనే 28 ఏళ్ల వ్యక్తి.. 49 ఏళ్ల తన తండ్రి సదాశివయ్య కుమారస్వామిని తుపాకీతో కాల్చి చంపాడు.
ఇటీవల కాలంలో యూఎస్ లో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. కోపం వస్తే తుపాకీ బయటకు తీస్తున్న పరిస్థితి. ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా వెంటనే అక్కడ నుంచి తుపాకీ శబ్ధం వినిపిస్తున్న పరిస్థితి. పైగా ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ తుపాకీ చప్పుల్ల గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఘణాంకాల ప్రకారం.. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే అమెరికాలో తుపాకీల కారణంగా మరణించినవారి సంఖ్య సుమారు 5000 అని అంటున్నారు. అంటే... సరాసరిన ప్రతీరోజూ 100 కంటే ఎక్కువ మరణాలు ఈ తుపాకీ కాల్పుల వల్ల సంభవించాయన్నమాట. ఈ నేపథ్యంలోనే భారతీయుడైన కొడుక్కి జీవిత ఖైదు పడింది.
అవును... అమెరికాలోని జార్జియాలోని ఫోర్సిత్ కౌంటీకి చెందిన రాజీవ్ కుమార స్వామి అనే 28 ఏళ్ల వ్యక్తి.. 49 ఏళ్ల తన తండ్రి సదాశివయ్య కుమారస్వామిని తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన 2021లో జరగ్గా... తాజాగా ఈ కేసుపై తీర్పు వెలువరించింది న్యాయస్థానం. ఈ నేపథ్యంలోనే రాజీవ్ కి జీవిత ఖైదు విధించింది.
వివరాళ్లోకి వెళ్తే... జూలై 22, 2021 సాయంత్రం 5:50 గంటల సమయంలో రాజీవ్, అతని తండ్రి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందట. ఈ సమయంలో ఆ వాగ్వాదం పీక్స్ కి చేరడంతోనో ఏమో కానీ కంట్రోల్ కోల్పోయిన రాజీవ్... తన గదిలో నుండి తుపాకీ తీసుకొచ్చాడు. అనంతరం అదే ఆవేశంతో తన తండ్రిపై పలుమార్లు కాల్పులు జరిపాడు.
దీంతో సదాశివయ్య కుమారస్వామి అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో రాజీవ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. తండ్రిని చంపినట్లు అభియోగాలు మోపారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా రాజీవ్ కు జీవిత ఖైదు శిక్ష విధించింది. ఆ విధంగా... యూఎస్ లోని భారతీయులైన తండ్రీ కొడుకుల జీవితాలు విషాదకరంగా మారాయి!!