జాన్వీ కపూర్ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. ఆమె సినిమాల్లోకి రావాలని వారి ఫ్యామిలీ కంటే, ఫ్యాన్సే ఎక్కువగా ఎదురు చూశారు. అందుకు ఆమె తల్లే కారణం. ఆమె తల్లి దివంగత నటి, అందాల తార శ్రీదేవి కావడంతో, ఆమె వారసురాలిగా జాన్వీ సినిమాల్లోకి రావాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఐదేళ్ల క్రితమే జాన్వీ బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అయితే, ఇప్పటి వరకు అక్కడ మంచి హింట్ అందుకోలేకపోయింది. దాని కోసం తన వంతు ప్రయత్నం తాను చేస్తూనే ఉంది.
తాజాగా, ఈ బ్యూటీ 'బవాల్' అనే మూవీలో నటించింది. ఈ మూవీలో ఆమెకు జోడిగా వరుణ్ ధావన్ నటించారు. సాజిద్ నడియద్ వాలా నిర్మించిన ఈ సినిమాకి, నితేశ్ తివారి దర్శకత్వం వహించాడు. లవ్ డ్రామా జోనర్లో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మూవీని డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మందుగా స్క్రీనింగ్ ఏర్పాటు చేయగా జాన్వీ హాజరైంది.
ఆ సమయంలో ఆమె ధరించిన డ్రెస్ టూ హాట్ గా ఉండటం విశేషం.టైట్ ఫిట్ షిమ్మరీ డ్రెస్ ధరించింది. ఆ డ్రెస్ లో తన ముందర ఎద అందాలను ఎర వేస్తూ, హొయలు పోతూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం విశేషం.
ఈ ఫోటోలు ప్రస్తుతం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక, ఈ బవాల్ మూవీని ముందు థియేటర్స్ లోనే విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ, మంచి రేటు రావడంతో డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయడం విశేషం.
అయితే, జాన్వీ నటించిన దాదాపు అన్ని సినిమాలో ఓటీటీలోనే విడుదల కావడం విశేషం. ఈ మూవీ కూడా ఓటీటీకి వెళ్లిపోవడంతో ఆమె చాలా నిరాశ చెందారని అనుకున్నారు. కానీ, అలాంటిది ఏమీ లేదని, ఓటీటీ ద్వారా తన సినిమా కోట్ల మంది ప్రజలకు చేరువౌతున్నందుకు తనకు సంతోషంగా ఉందని చెప్పారు.
ఇక, ఈ బ్యూటీ తెలుగులో దేవర మూవీతో గ్రాండ్ గా లాంఛ్ కాబోతోంది. తెలుగులో మొదటి సినిమానే ఆమెకు ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం రావడం విశేషం. మరో వైపు తెలుగులోనూ అడుగుపెట్టాలని ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.