మత్తెక్కించే కేతిక జిగిబిగి అందాలు
`బ్రో: ది అవతార్`లో తన నటనతో ప్రశంసలు పొందిన కేతికా శర్మ అంతకుముందు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ సరసన రొమాంటిక్ చిత్రంతో కథానాయికగా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
`బ్రో: ది అవతార్`లో తన నటనతో ప్రశంసలు పొందిన కేతికా శర్మ అంతకుముందు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ సరసన రొమాంటిక్ చిత్రంతో కథానాయికగా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా, నాగశౌర్య సరసన లక్ష్య చిత్రంలో నటించింది. అయితే ఈ భామ కెరీర్ కి బ్రో ఒక్కటే హిట్టు. జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటున్న బ్యూటీగా కేతికకు పేరుంది.
సినీకెరీర్ సంగతి ఎలా ఉన్నా ఈ భామకు సోషల్ మీడియాల్లో అదిరిపోయే ఫ్యాన్స్ ఉన్నారు. నిరంతరం తన ఇన్ స్టా పోస్టింగుల కోసం ఎగబడే అభిమానం ఉంది. ఇటీవల ఆస్ట్రియా అందాలను ఆస్వాధిస్తూ ఆహ్లాదకరమైన విహారయాత్రను ఎంజాయ్ చేసింది.
ఇటీవలి ఫోటోషూట్లో కేతిక మరోసారి తన స్టైల్ కంటెంట్ తో ప్రావీణ్యాన్ని ప్రదర్శించింది. అలా డ్యాన్ నుంచి అత్యంత వేగంగా పారుతున్న జలపాతానికి ఎదురుగా నిలబడి ఇదిగో ఇలా స్టైలిష్ గా ఫోజిచ్చింది. బ్లూ డెనిమ్స్ కి కాంబినేషన్ గా బాడీకాన్ టాప్ ని కేతిక ధరించింది. ఈ డ్రెస్ లో కేతిక మత్తు పెంచుతోందంటూ యూత్ కామెంట్లు చేస్తున్నారు. కేతిక అందాల వలకు చిక్కితే అంతేగా అంటూ వ్యాఖ్యలు గుప్పిస్తున్నారు. మొత్తానికి కేతిక సింపుల్ ట్రిక్ ఇప్పుడు వెబ్ లో ఇలా వర్కవుటైంది.
గతంలో ప్రముఖ యూట్యూబర్ గా ఓ వెలుగు వెలిగిన కేతికా శర్మ తనవైన పాపులర్ డైలాగ్లు, పాటల రీమిక్స్ లతో పాపులరైంది. 2021లో అనిల్ పాదూరి దర్శకత్వం వహించిన రొమాంటిక్ తో టాలీవుడ్ కి పరిచయమైంది. పూరి జగన్నాధ్ రచించి నిర్మించిన తెలుగు చిత్రం రొమాంటిక్ లో ఆకాష్ కథానాయకుడిగా నటించాడు. ఇటీవల బ్రో చిత్రంలోను ఆకట్టుకునే నటనను ప్రదర్శించింది.
తదుపరి రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వంలో ఇంకా టైటిల్ నిర్ణయించని సినిమాలో నటిస్తోంది. ఇందులో అదితి రావ్ హైదరీ- అన్సన్ పాల్ ఇతర పాత్రధారులు. కేతిక కెరీర్ ఎదుగుదల ఆసక్తికరం. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను పరిశ్రమను ఆకర్షించడంలో ఈ భామ ముందుంది.