క్రేజు పెరగడంతో గ్లామర్ డోస్ పెంచిన కృతి

చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత రెమ్యునరేషన్ విషయంలో కూడా వెంటనే స్పీడ్ పెంచేసింది.

Update: 2023-07-16 12:44 GMT

చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత రెమ్యునరేషన్ విషయంలో కూడా వెంటనే స్పీడ్ పెంచేసింది. ఆమె చాలా వేగంగానే కోటికి పైగా రెమ్యునరేషన్ అందుకుని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఉప్పెన తర్వాత మళ్ళీ ఈ బ్యూటీ కెరీర్లో మళ్ళీ ఎలాంటి సక్సెస్ అయితే పడలేదు. శ్యామ్ సింగరాయ్ బంగార్రాజు సినిమాలు పర్వాలేదు అనిపించినప్పటికీ కూడా ఆ తర్వాత చేసిన సినిమాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా దారుణమైన ఫలితాన్ని కలిగించాయి.

రామ్ పోతినేనితో చేసిన ది వారియర్ అలాగే నితిన్ తో చేసిన మాచర్ల నియోజకవర్గం రెండు సినిమాలు కూడా వెంట వెంటనే డిజాస్టర్ అయ్యాయి. ఇక టాలెంటెడ్ దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో చేసిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇక ఈ ఏడాది నాగచైతన్యతో చేసిన కస్టడీ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.


ఈ బ్యూటీ ప్రస్తుతం ఫ్లాప్ ట్రాక్ లోనే కొనసాగుతోంది. అయినప్పటికీ కూడా ఆమెకు ఇండస్ట్రీలో ఫాలోయింగ్ అయితే గట్టిగానే పెరుగుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అమ్మడు రీసెంట్ గా ఒక రికార్డును అందుకుంది. ఇటీవల కాలంలో ఇన్ స్టాగ్రామ్ లో ఎవరికీ కూడా ఈ స్థాయిలో అయితే క్రేజ్ రాలేదు. అమ్మడు వచ్చి చాలా తక్కువ కాలం అయినప్పటికీ కూడా ఏకంగా 6 మిలియన్ల ఫాలోవర్స్ పెరగడం విశేషం.

ఇక ఈ సందర్భంగా అమ్మడు ప్రత్యేకమైన కొన్ని గ్లామరస్ ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. 6 మిలియన్ ఫ్యామిలీ అంటూ పర్పుల్ కలర్ డ్రెస్ లో అమ్మడు తన అందాలు హైలైట్ అయ్యే విధంగా స్టిల్ ఇచ్చింది. ఇక ఫోటోలు నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. చూస్తుంటే కృతి శెట్టి మెల్ల మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతున్నట్లుగా తెలుస్తోంది.

2003లో జన్మించిన కృతి శెట్టి వయసు ఇప్పుడు 19 ఏళ్ళు మాత్రమే. ఇక అమ్మడు స్టార్ హీరోయిన్ గా మొదట భారీ స్థాయిలో పారితోషకం అందుకుంది. కానీ ఆ తర్వాత చేసిన కమర్షియల్ సినిమాలు కొంత నిరాశపరిచాయి. ఇక ఇప్పుడు ఆమె చేతిలో ఒక మలయాళం సినిమాతో పాటు తమిళంలో జీని అనే ఒక పెద్ద సినిమా అయితే ఉంది. ఈ రెండు సినిమాలు మాత్రమే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. అలాగే తెలుగులో మరొక ఆఫర్ అందుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News