నిలువెత్తు ఎర్ర గులాబీలా మానుషి.. మైండ్ బ్లాక్
కవ్వించే అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేసే భామ మానుషి చిల్లర్.
కవ్వించే అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేసే భామ మానుషి చిల్లర్. గ్లామర్ డోస్ రెట్టింపు చేసి యూత్‌ను రెచ్చగొడుతుంటుంది. ప్రస్తుతానికి వరుస సినిమాల్లో నటిస్తూ మస్త్ జోరులో ఉంది. అయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఫోటో షూట్లతో అందాలన్నీ ప్రదర్శిస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన పిక్స్ చూస్తే ఎర్ర గులాబీ పువ్వులా ధగధగ మెరిసిపోతూ ఎంతో అందంగా కనిపించింది.
హరియాణాకు చెందిన ఈ ముద్దుగుమ్మ 67వ మిస్ వరల్డ్ 2017 కిరీటం దక్కించుకుని అందరి కంట్లో పడింది. ఇక ఆమెకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. అందరూ ఆమె అందాలను చూడటానికి తెగ ఆరాటపడ్డారు. అంతలా గుర్తింపు సంపాదించుకుందీ భామ. అలా వచ్చిన క్రేజ్‌తో సినిమాల్లోకి అడుగుపెట్టేసింది.
ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లే అయినా ఈమెకు మాత్రం మొదటి నుంచి మోడలింగ్‌పై ఆసక్తి ఉండేదట. అందుకే స్కూల్ డేస్ నుంచే ఫ్యాషన్ షో ల్లో పాల్గొనేది. ఆ జర్నీలోనే మిస్ వరల్డ్‌గా అవతరించింది. అనంతరం 2022లో బాలీవుడ్ అరంగేట్రం చేసింది. అక్షయ్ కుమార్ తో కలిసి సామ్రాట్ పృథ్వీరాజ్, ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వంటి చిత్రాలు చేసింది. కానీ ఈ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి.
ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ అందాల ఆరబోతతో తెగ సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడి గ్లామర్ షో కు అంతా ఫిదా అవుతున్నారు. పింక్ కలర్ లాంగ్ మోడ్రన్ ఔట్ఫిట్లలో క్యూట్ సెల్ఫీ దిగుతూ కన్నుల విందు చేసింది. పింక్ కలర్ లిప్‌స్టిక్, లూజ్ హెయిత్తో మెస్మరైజ్ చేసేసింది. చేతికి ఆమె ధరించిన మందపాటి గోల్డ్ బ్రాస్లైట్ స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంది.
ప్రస్తుతం ఈ భామ.. తెలుగులో వరుణ్ తేజ్‌తో పాన్ ఇండియా మూవీ ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంలో నటించింది. ఇది డిసెంబర్లో రిలీజ్ కానుంది. ఇంకా తెహ్రాన్, బడే మియాన్ చోటే మియాన్ చిత్రాల్లో నటించింది.