పూజా.. రెడ్ హాట్ ఆల్ఫా ఫీమేల్!
దక్షిణాది నుంచి పూర్తిగా నిష్కృమించింది పూజా హెగ్డే. ఇక్కడ అవకాశాలు లేని సమయంలో హిందీ పరిశ్రమలో బిజీగా మారింది.
దక్షిణాది నుంచి పూర్తిగా నిష్కృమించింది పూజా హెగ్డే. ఇక్కడ అవకాశాలు లేని సమయంలో హిందీ పరిశ్రమలో బిజీగా మారింది. తాజాగా రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం `దేవా` విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ సరసన పూజా కథానాయికగా నటించింది. ఇంతకుముందు టీజర్ విడుదల చేయగా, అది గ్రిప్పింగ్ డ్రామాతో ఆకట్టుకుంది. ఇప్పుడు మేకర్స్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. టీజర్, ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ట్రైలర్ లో షాహిద్ కపూర్ పోలీసు పాత్ర ఆకట్టుకుంది అతడి నటన కెరీర్ బెస్ట్ గా ఉంటుందని భరోసా లభించింది.
ఇక ఈ చిత్రంలో కథానాయికగా నటించిన పూజా హెగ్డే .. షాహిద్‌తో అద్భుతమైన కెమిస్ట్రీని వర్కవుట్ చేయడం హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఈ గ్రిప్పింగ్ కాప్ డ్రామాలో షాహిద్‌ను ఇంతకు ముందు ఎప్పుడూ చూడని అవతార్‌లో దర్శకుడు ఆవిష్కరించనున్నారు. ఈ కాప్ డ్రామాతో పూజా హెగ్డే చాలా కాలం తర్వాత హిందీ పరిశ్రమకు తిరిగి వస్తోంది. `దేవా` విజయంపై సర్వత్రా ఉత్కంఠగా వేచి చూస్తోంది. దేవా మేకర్స్ ఇప్పటికే విడుదల తేదీని ఖరారు చేశారు. దేవా 31 జనవరి 2025న థియేటర్లలోకి రానుంది.
తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పూజా ఎరుపు రంగు డేవిడ్ కోమా మినీ డ్రెస్‌లో కనిపించింది. సన్నని హాల్టర్-నెక్ పట్టీలు, ఆఫ్ షోల్డర్ , లాంగ్ స్లీవ్‌లు , కఫ్ జిప్‌లు అందాన్ని పెంచాయి. పూజా సింపుల్ గా అనవసర హంగామా లేకుండా కొన్ని ఆభరణాలను ధరించింది. తాజా ఈవెంట్లో పూజా హెగ్డే మాట్లాడుతూ-``మీరు ఆల్ఫా మగవాడిని చూశారు.. ఇప్పుడు ఆల్ఫా ఫిమేల్ రాక కోసం సమయం ఆసన్నమైంది`` అని వ్యాఖ్యానించారు.