ఒక్క హుక్స్ పెట్టుకుని.. రాశీఖన్నా సంక్రాంతి ట్రీట్
ఈ మకర సంక్రాంతిని పురష్కరించుకుని అందాల కథానాయిక రాశీఖన్నా ఇచ్చిన ట్రీట్ అందుకు మినహాయింపేమీ కాదు.
సాంప్రదాయం ఓవైపు.. గ్లామర్ ఎలివేషన్ మరోవైపు.. ఈసారి సంక్రాంతి బ్లౌజ్ ల ఎంపిక మునపటితో పోలిస్తే చాలా స్పైసీగా కనిపించాయి. బుల్లితెర నటీమణులు, వెండితెర కథానాయికలు సంక్రాంతి సందర్భంగా తమ ఫ్యాషన్ సెన్స్ విషయంలో చాలా అప్ గ్రేడ్ అయ్యారు. మునుపటి రోజులతో పోలిస్తే ఇటీవల కొంత ఎక్స్ పోజింగ్ కూడా ఎక్కువైందనేది కాదనలేని నిజం.
ఈ మకర సంక్రాంతిని పురష్కరించుకుని అందాల కథానాయిక రాశీఖన్నా ఇచ్చిన ట్రీట్ అందుకు మినహాయింపేమీ కాదు. రాశీ చూడటానికి ట్రెడిషనల్ లుక్ లో కనిపించినా అందమైన బ్లౌజ్ ని స్పైసప్ చేసింది. ఒకే ఒక్క హుక్స్ పెట్టుకుని, అందమైన డిజైనర్ బ్లౌజ్ తో కవ్వించింది రాశీ. ఇక ఈ బ్లౌజ్ కి తగ్గట్టే, డిజైనర్ శారీని కూడా ఎంపిక చేసుకుంది. ఓవరాల్ లుక్‌లో రాశీ ట్రీట్ అభిమానులను కట్టి పడేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ యువతరంలో వైరల్‌గా మారుతున్నాయి.
ఎర్ర అంచు చీర.. డిజైనర్ బ్లౌజ్ లో రాశీ ఖన్నా టూమచ్ గా కవ్విస్తోంది! అంటూ అభిమానులు భేజారైపోతున్నారు. రాశీ నెవ్వర్ బిఫోర్ లుక్ ఇది అంటూ వెబ్ లో వైరల్ చేస్తున్నారు. రాశీఖన్నా నిజంగా ఈ డ్రెస్ లో ఎంతో అందంగా ఉందంటూ పలువురు అభిమానులు లవ్ ఈమోజీలను షేర్ చేస్తున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ప్రస్తుతం వరుసగా వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో నటించేందుకు రాశీ సన్నాహకాల్లో ఉందని సమాచారం. సిద్ధు జొన్నలగడ్డ ` తెలుసు కదా` అనే తెలుగు చిత్రంలో నటిస్తున్న రాశీ... టిఎంఇ (విక్రాంత్ మాస్సే) అనే హిందీ చిత్రంలోను నటిస్తోంది. `అగథియా` ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. టిఎంఇ, అగథియా కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు అని తెలుస్తోంది.