క‌ళ్లు తిప్పుకోరు.. బుట్ట చేతుల కుంద‌న‌పు బొమ్మ‌!

ఇదిగో ఇక్క‌డ‌ రోజ్ క‌ల‌ర్ డిజైన‌ర్ లుక్ లో క‌నిపిస్తున్న ఈ బ్యూటీని త‌ల‌చి త‌ల‌చి అభిమానుల‌ క‌ల‌వ‌రం ఇలా ఉంది.

Update: 2023-09-10 15:30 GMT

అందానికే అందానివో అపురూప సౌంద‌ర్యానివో.. ఇదిగో ఇక్క‌డ‌ రోజ్ క‌ల‌ర్ డిజైన‌ర్ లుక్ లో క‌నిపిస్తున్న ఈ బ్యూటీని త‌ల‌చి త‌ల‌చి అభిమానుల‌ క‌ల‌వ‌రం ఇలా ఉంది. అందానికి అందం ప్ర‌తిభ ఒకే ఒర‌లో ఇమిడిపోతే అది నుస్ర‌త్ భారుచ్చా అని అంగీక‌రించాలి. ఇప్ప‌టివ‌ర‌కూ బాలీవుడ్ లో ఎంద‌రు అగ్ర హీరోయిన్లు ఉన్నా కానీ, న‌టిగా త‌న స్థాయిని ఏమాత్రం త‌గ్గ‌కుండా ముందుకు సాగుతోంది నుస్ర‌త్.

బాలీవుడ్ లో వ‌రుస‌గా క్రేజీ సినిమాల్లో న‌టిస్తూ ఈ అమ్మ‌డు కెరీర్ ప‌రంగా ఫుల్ జోష్ లో ఉంది. నుష్రత్ భరుచ్చా ఒక అద్భుతమైన నటిగానే కాకుండా ఫ్యాషన్ ఐకాన్ కూడా. పదే పదే రెడ్ కార్పెట్ ఈవెంట్ల‌లో ప్రధాన ఫ్యాషన్ లక్ష్యాలను సెట్ చేసే భామ‌గా పాపుల‌రైంది. ఇలా చెప్పుకుంటూ పోతే నుస్ర‌త్ హెడ్ ట‌ర్న‌ర్ గా మారిన సంద‌ర్భాల‌కు కొద‌వేమీ లేదు.

తాజాగా నుస్ర‌త్ ప్ర‌ఖ్యాత జీక్యూ ఇండియా మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ కోసం ఫోటోషూట్ లో పాల్గొంది. ఈ ఫోటోషూట్ నుంచి ఒక అరుదైన ఫోటోగ్రాఫ్ ని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. ఇందులో సింథ‌టిక్ థిక్ క‌ల‌ర్ డిజైన‌ర్ దుస్తుల్లో నుస్ర‌త్ హాట్ గా క‌నిపిస్తోంది. ఆ చేతుల‌కు బుట్ట‌లు రెండు ఎంతో ఆక‌ర్ష‌ణ‌ను పెంచాయ‌న‌డంలో సందేహం లేదు. ఈ డిజైన‌ర్ లుక్ యూనిక్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.


ప్యార్ కా పంచ్‌నామా (2011), దాని సీక్వెల్ `ప్యార్ కా పంచ్‌నామా 2` (2015), సోనీ కే టిటు కి స్వీటీ (2018) వంటి విజయవంతమైన బాలీవుడ్ చిత్రాలలో తన పాత్రకు నుష్రత్ భరుచ్చా పేరు తెచ్చుకుంది. ఇటీవల ఆకెళ్లిలో కనిపించింది. నూతన దర్శకుడు ప్రణయ్ మేష్రామ్ దర్శకత్వం వహించిన అకెల్లి యుద్ధ పీడిత ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయ అమ్మాయి (నుష్రత్ భర్చా పోషించిన) పాత్ర‌లో న‌టించింది. ఇరాక్ యుద్ధంలో అన్ని అసమానతలతో పోరాడే యువ‌తిగా క‌నిపించింది. తీవ్రవాదంతో పోరాడుతుంది .. తన స్వదేశానికి (భార‌త్ కి) తిరిగి రావడంలో విజయం సాధిస్తుంది. నుష్రత్ ఈ చిత్రంలో తన కంఫర్ట్ జోన్ నుంచి తప్పుకుంది. ఈ చిత్రంలో భవనాలపై నుండి దూకడం .. తుపాకీలను కూడా పట్టుకోవడం వంటి ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాల్లో నుస్ర‌త్ అద్భుతంగా న‌టించింద‌ని పేరొచ్చింది. త‌న నటనా ప్రావీణ్యం ప్రేక్షకులను తెరపై అతుక్కుపోయేలా చేస్తుంది. ఒక్క నిమిషం కూడా కన్ను రెప్ప వేయనివ్వని అత్యుత్తమ ప్రదర్శనలతో ఆక‌ట్టుకుంది.

Tags:    

Similar News