ఫోటో స్టోరి: రకుల్ కిల్లర్ లుక్ వైరల్!
ఈ నెల ప్రారంభంలో రకుల్ పుట్టినరోజున ప్రియుడు జాకీ భగ్నానితో రొమాంటిక్ డేట్లో కనిపించింది.
ఈ నెల ప్రారంభంలో రకుల్ పుట్టినరోజున ప్రియుడు జాకీ భగ్నానితో రొమాంటిక్ డేట్లో కనిపించింది. ఈ జంట ఔటింగ్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. నిర్మాత జాకీ భగ్నానీతో సంబంధాన్ని రకుల్ 2021లో రకుల్ అధికారికం చేసింది. అప్పటి నుండి కలిసి అనేక బహిరంగ ప్రదర్శనలు ఇచ్చారు. టాలీవుడ్ కోలీవుడ్ నుంచి నిష్కృమించాక ఇప్పుడు పూర్తిగా హిందీ సినిమాలపైనే దృష్టి సారిస్తోంది. వెబ్ సిరీస్ లలోను నటించేందుకు ప్రయత్నాల్లో ఉంది.
రకుల్ ప్రీత్ సింగ్ తాజా ఫోటోషూట్ ఇప్పుడు అభిమానుల్లో హీట్ పెంచుతోంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎగ్జయిట్ చేసే ఫోటోలను రకుల్ షేర్ చేసింది. ఈ ఫోటోలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. రకుల్ లో నెక్లైన్తో అందమైన పొడవాటి దుస్తులు ధరించి, గ్లామరస్‌గా కనిపించింది. బ్రింజాల్ కలర్ డిజైనర్ డ్రెస్ లో రకుల్ హాట్ కంటెంట్ ఎలివేషన్ ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలలో రకుల్ మోములోని మెరుపులు ఆకర్షిస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలోకి తిరిగి ఎప్పుడు వస్తుందో తెలీదు కానీ రకుల్ ఇప్పటికి భారీ ప్లానింగ్స్ తో ముందుకు సాగుతోందని అర్థమవుతోంది. రకుల్ తదుపరి ఓటీటీ సిరీస్ లలోను నటించనుందని తెలుస్తోంది.
ఆలయాన్ తో కంబ్యాక్?
అందాల రకుల్ ప్రీత్ టాలీవుడ్ కోలీవుడ్ లో దశాబ్ధం పైగానే కెరీర్ ని సాగించింది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో కథానాయికగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ధృవ, కట్‌పుట్లీ, డాక్టర్ జి సహా ఎన్నో చిత్రాలలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చింది. తదుపరి `అయాలాన్` చిత్రంతో అభిమానుల ముందుకు రానుంది. ఇది సైన్స్ ఫిక్షన్ కంటెంట్ తో వస్తున్న సినిమా. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా పాన్ ఇండియా కేటగిరీలో సెట్ చేసిన చిత్రం. వెటరన్ డైరెక్టర్ కెఎస్.రవి కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదట దీపావళికి 2023 విడుదలకు సిద్ధమైంది. కానీ ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా సినిమా విడుదల తేదీని 2024కి వాయిదా వేసారు. జాకీ భగ్నాని సహ నిర్మాతగా రూపొందించిన `గణపత్: పార్ట్ 1` ఈ వారం విడుదలైంది. ఇంతలో, గత రాత్రి బాలీవుడ్ పార్టీలో, షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రం డుంకీ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీతో కలిసి జాకీ భగ్నానీ కనిపించారు.