రష్మిక.. సీరియస్ లుక్ లో హై గ్లామర్ డోస్
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న అందాల భామ రష్మిక మందన.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న అందాల భామ రష్మిక మందన. ఈ అమ్మడు ఓ వైపు బాలీవుడ్ లో యానిమల్, తెలుగులో పుష్ప 2లో నటిస్తోంది. ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడం విశేషం. రీసెంట్ గా రెయిన్ బో అనే ఫీమేల్ సెంట్రిక్ మూవీ షూటింగ్ కూడా పూర్తి చేసే పనిలో ఉంది. మాస్ మహారాజ్ రవితేజకి జోడీగా కొత్త ప్రాజెక్ట్ లో రష్మికని తీసుకోవడానికి చర్చలు జరుగుతున్నాయంట.
ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కూడా ఈ కన్నడ కస్తూరి ఫ్యాషన్ ప్రపంచంలో తన హవాని కొనసాగిస్తూ ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకి సంబంధించి అప్డేట్స్ నిఅందిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మ్యాగజైన్ కవర్ పేజీలపై కూడా దర్శనం ఇస్తూ ఉంటుంది. బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత గ్లామర్ డోస్ కూడా పెంచిన రష్మిక మందన తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది.
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కావాలని కలలు కంటున్న ఈ అమ్మడు అందుకు తగ్గ స్టేజ్ ని సిద్ధం చేసుకుంటుంది. తాజాగా ఇంగ్లీష్ ఫ్యాషన్ మ్యాగజైన్ ఎలే కోసం ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్ తో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలని ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలని ఎలే మ్యాగజైన్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. వైట్ కలర్ లాంగ్ ప్యాంట్, బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ తీ షార్ట్ వేసుకొని హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చింది.
ఈ ఫోటోలలో రష్మిక మందన హాట్ లుక్స్ కుర్రకారుకి చెమటలు పట్టిస్తున్నాయి. బాడీ ఎక్స్ పోజ్ చేయకుండా హస్కీ లుక్స్ తో హీట్ పెంచేస్తోంది. ఇందులో ఎలే మ్యాగజైన్ రష్మిక మందనని పాన్ ఇండియా స్టార్ గా అభివర్ణిస్తూ ఫోటోలకి ఇంటరెస్టింగ్ క్యాప్షన్ జోడించారు. ఈ క్యాప్షన్ కూడా ఆమె అందాలని ఇందుమడించేలా ఉండటం విశేషం.
ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో బాలీవుడ్ వీకెండ్ పార్టీలలో కూడా రష్మిక మందన చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తోంది. అక్కడ దర్శక, నిర్మాతల దృష్టిలో పడే ప్రయత్నంలో అమ్మడు ఉంది. యానిమల్ తర్వాత మరో హిందీ సినిమాకి ఇప్పటికే రష్మిక సైన్ చేసినట్లు బిటౌన్ లో వినిపిస్తోంది.