ఫోటో స్టోరి: సాంప్రదాయం C/O సమంత
తాజాగా ఇన్ స్టాలో సామ్ షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ చూపరుల దృష్టిని విశేషంగా ఆకర్షించింది.
రాజీ (శ్రీలంకన్ మిలిటెంట్) లాంటి బోల్డ్ పాత్రలో నటించినా లేదా జెస్సీగా ఏమాయ చేసినా.. అందమైన మనసున్న భార్యగా మజిలీ చేసినా.. ఖుషీ ప్రేమికురాలిగా ఆకట్టుకున్నా.. అది సమంతకే చెల్లింది. సామ్ ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. ఇటీవల మయోసైటిస్ నుంచి నెమ్మదిగా బయటపడుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికి అమెరికాలో చికిత్స ఇంకా కొనసాగుతోంది.
మరోవైపు సమంత తన కెరీర్ ప్రణాళికలను లైట్ తీస్కోవడం లేదు. వైద్య చికిత్స కోసం కొన్నాళ్ల పాటు బ్రేక్ తీసుకున్నా కానీ, భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి సారిస్తూనే ఉంది. ఇంతలోనే మోడలింగ్ అసైన్ మెంట్స్, బిజినెస్ ప్లాన్స్ విషయంలోను ఎంతో తెలివైన ఎత్తుగడలతో ముందుకు వెళుతోంది. ఇప్పుడు పాపులర్ బ్రాండ్ లేడీ దుస్తులకు ప్రచారం చేస్తోంది.
తాజాగా ఇన్ స్టాలో సామ్ షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ చూపరుల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ముదురు పచ్చ రంగు స్లిట్ మిడీ .. ఎరుపు రంగు బాటమ్ ని ధరించి ఎంతో స్టైలిష్ గా ఫోజిచ్చింది సమంత. ఇందులో ఎంతో ట్రెడిషనల్ గా కనిపిస్తున్నా, అంతకుమించి సామ్ షైనింగ్ లుక్ మనసుల్ని దోచింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా దూసుకెళుతోంది.
సమంత రూత్ ప్రభు చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి చిత్రంలో నటించారు. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా కానీ, చక్కని సమీక్షలు అందుకున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రధాన ఇతివృత్తం నమ్మకాలు, సైన్స్ అనే చర్చపై ఆధారపడినది. పెళ్లయిన జంట కాపురంలో కలతల నేపథ్యంలో ఈ సినిమా కంటెంట్, సమంత, విజయ్ ల నటన ఎంతో ఆకట్టుకున్నాయని సమీక్షలు వచ్చాయి.