అధికారంలో ఉన్న ఇద్దరు తెలుగు తమ్ముళ్లు వియ్యంకులుగా మారుతున్న వేళ.. హడావుడి ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ తనంతో.. కోట్లాది రూపాయిల్ని ఖర్చు పెట్టిన ఈ పెళ్లి గుంటూరు జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వియ్యంకులుగా మారి.. చేసిన పెళ్లి ఖర్చు గుంటూరు జిల్లాలో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
దాదాపు రూ.10కోట్లకు పైనే పెళ్లి కోసం ఖర్చు పెట్టినట్లుగా చెబుతున్నారు. భోజనాల కోసమే రూ.2కోట్లు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక.. లైటింగ్.. డెకరేషన్.. ఇలా చెప్పుకుంటూ పోతే భారీతనం ఏమాత్రం మిస్ కాకుండా చేసిన ఈ పెళ్లి ఖర్చు కోట్లల్లో ఉంటుందని చెప్పొచ్చు. గుంటూరు జిల్లాకు చెందిన వినుకొండ ఎమ్మెల్యే జీవీఆంజనేయులు కుమార్తెకు.. పెదకూరపాడు ఎమ్మెల్యే కుమారుడితో జరిగిన పెళ్లి వేడుక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇరువురు ఎమ్మెల్యేలు కలిసి అట్టహాసంగా జరిపిన ఈ పెళ్లి వేడుక జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కోట్లాది రూపాయిల్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసిన వైనం అందరి లుక్కు పడేలా చేస్తోంది. పెదకూరపాడు ఎమ్మెల్యేకు చెందిన వెంచర్స్ లో 30 ఎకరాల్లో పెళ్లి వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. ఒకటిన్నర ఎకరంలో పెళ్లి మండపాన్ని ఏర్పాటు చేశారు. వీవీఐపీ.. వీఐపీ.. సాదాసీదా అంటూ మూడు కేటగిరిల్లో ఏర్పాటు చేసిన భోజనాలు భారీగా ఉండటమే కాదు.. ఇందుకోసం రూ.2కోట్లు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.
పెళ్లి మండపాన్ని రూ.2.5కోట్లతో ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పెళ్లికి వేదికను ఏర్పాటు చేసిన బెంగళూరు ఈవెంట్స్ సంస్థే.. తాజా మండపాన్నిఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. పెళ్లికి వచ్చే వారి కోసంపెద్ద ఎత్తున ఆర్టీసీ.. ప్రైవేట్ బస్సులు.. కార్లను పెద్ద ఎత్తున తిప్పారు. వీటి కోసమే రూ.42లక్షల ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. ఆర్భాటంగా జరిపిన ఈ పెళ్లి వేడుకకు రూ.10కోట్లు చెబుతున్నప్పటికీ.. వాస్తవంలో మాత్రం అంతకుమించే ఉంటుందన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/