జూన్ ముగిసిపోయింది. జులై వచ్చేసింది. కొత్త నెలలో కొత్త సమస్య ఒకటి సిద్ధంగా ఉంది. ఈ నెలలో ఏకంగా 10 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. బ్యాంకులకు సెలవులైతే ఏంటనుకుంటే తప్పులో కాలేసినట్లే. మారిన రోజుల్లో బ్యాంకులతో పని మరింత పెరిగింది. జేబులో డబ్బులు ఉంచుకోవటం మానేసి అకౌంట్లో డబ్బులు ఉంచుకోవటం.. అవసరమైతే ఏటీఎం సెంటర్లకు వెళ్లి కార్డు గీకేసి డబ్బులుతీసుకోవటం అలవాటుగా మారింది.
ఇదే ఇప్పుడు ఇబ్బందిగా మారింది. బ్యాంకు సెలవు రోజుల్లో ఏటీఎం సెంటర్లలో క్యాష్ ఫీడ్ చేయటం ఉండదు. దీంతో.. ఏటీఎం సెంటర్లలో డబ్బులు నిండుకునే పరిస్థితి. ఇది.. ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించే పరిస్థితి. అందులోకి వరుస సెలవులు వస్తే.. ఈ ఇబ్బంది మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో మొత్తం ఐదు ఆదివారాలు.. రెండు శనివారాలు.. రంజాన్ తో పాటు.. రెండు రోజులు బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తుండటంతో పది రోజుల వరకూ బ్యాంకులకు తాళాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల వరకూ జేబులో కాస్త డబ్బులు ఉంచుకునేలా ప్లాన్ చేసుకోవటం మంచిది. లేదంటే.. అవసరమైన సమయంలో బ్యాంకులో డబ్బులున్నా.. చేతిలో డబ్బుల్లేని చిత్రమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది సుమా.