గన్ కల్చర్ అధికంగా ఉంటే అమెరికాలో మరో ఘోరం చోటుచేసుకుంది. ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? ఎవరు బాధ్యులు అన్న అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం బయటకు రానప్పటికీ.. తాజాగా ఓరెగాన్ విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పులు అమెరికన్లను ఉలికిపాటుకు గురి చేస్తోంది.
గుర్తు తెలియని వ్యక్తి ఒకరు జరిపిన కాల్పుల్లో పది మంది విద్యార్తులు మృత్యువాత పడ్డారు. యూనివర్సిటీలో జరిపిన కాల్పుల్లో ఇంత భారీ మొత్తంలో విద్యార్థులు మరణించటం తీవ్ర కలకలం రేపుతోంది. కాల్పులు జరిపిన ఆగంతకుడ్ని పోలీసులు కాల్చి చంపేశారు. అతడి వయసు 20 ఏళ్ల వరకూ ఉండొచ్చని చెబుతున్నారు.ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం బయటకు రావాల్సింది ఉంది.