సంధ్య థియేటర్ తొక్కిసలాటలో కీలక సూత్రధారి!... ఎవరీ ఆంటోనీ?

ఈ సందర్భంగా సుమారు 3 గంటలకు పైగా జరిగిన విచారణలో పోలీసులు 20 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.

Update: 2024-12-24 10:05 GMT

'పుష్ప-2' బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అల్లు అర్జున్ ఈ రోజు చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమారు 3 గంటలకు పైగా జరిగిన విచారణలో పోలీసులు 20 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.

ఈ విచారణ ప్రధానంగా ఇటీవల అల్లు అర్జున్ మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు, పోలీసులపై ఆరోపణలు.. సీవీ ఆనంద్ విడుదల చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్ కు సంబంధించిన వీడియో కేంద్రంగా జరిగిందని అంటున్నారు. మరోపక్క... తొక్కిసలాటకు ప్రధాన సూత్రధారిగా చెబుతున్న ఆంటోనీ అనే బౌన్సర్ ను పోలీసులు సంధ్య థియేటర్ వద్దకు తీసుకురానున్నారని అంటున్నారు.

అవును... సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందని తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఈ తొక్కిసలాటకు ప్రధాన నిందితుడిగా చెబుతున్న ఆంటోనీ అనే బౌన్సర్ ను సీన్ రీ కనస్ట్రక్షన్ కోసం సంధ్య థియేటర్ వద్దకు తీసుకురానున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇతడు అరెస్టై జైల్లో ఉన్నాడు!

జరిగిన తొక్కిసలాటకు ఇతడే ప్రధాన కారణం అని పోలీసులు భావిస్తున్నారని అంటున్నారు. ఆ రోజు అల్లు అర్జున్ కు సెక్యూరిటీగా ఉన్న సుమారు 40 మందికి పైగా బౌన్సర్లకు ఆంటొనీ ఆర్గనైజర్ అని చెబుతున్నారు. థియేటర్ వద్ద పోలీసులు అల్లు అర్జున్ ను ముందుగానే కలుసుకునే అవకాశం లేకుండా అడ్డుకోవడంలో ఆంటోనీది కీలకపాత్ర అని అంటున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ఆంటోనీని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారని అంటున్నారు. ఈ రోజు అల్లు అర్జున్ ను విచారించిన నేపథ్యంలో.. ఆంటోనీని సంధ్య థియేటర్ వద్దకు తీసుకెళ్లి సీన్ రీ కనస్ట్రక్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికోసమే సంధ్య థియేటర్ వద్ద పోలీసులు అధిక సంఖ్యలో ఉన్నారని అంటున్నారు.

Tags:    

Similar News