సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. వివిధ రాజకీయ పార్టీల నుంచి మీడియా వరకూ అందరికి ఆయన గుర్తుకు వస్తారు. అంతేనా.. ఆయన ఓటు వేసేందుకు వస్తుంటే భారీ ఏర్పాట్లు చేస్తారు. మీడియా లో ప్రత్యేక కవరేజీ ఇస్తారు. ఇంతకూ ఆయనేం రాజకీయ ప్రముఖుడు కాదు. కానీ.. అంతకు మించే. ఎందుకంటే.. దేశ ప్రథమ ఓటరు గా ఆయనదో ప్రత్యేకత.
103 ఏళ్ల మాస్టర్ శ్యామ్ శరణ్ నేగీ హిమాచల్ ప్రదేశ్ కు చెందిన వారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని సైతం లెక్క చేయకుండా ఎన్నికల్లో ఓటు వేసే ఆయన.. ఎన్నికల్లో అందరూ ఓటు వేయాలంటూ ఓటరు చైతన్య కార్యక్రమాల్ని కూడా నిర్వహిస్తుంటారు. 1917లో పుట్టిన శ్యామ్ ఉపాధ్యాయుడి గా పని చేసి రిటైర్ అయ్యారు. 1951 లో జరిగిన సాధారణ ఎన్నికల నుంచి క్రమం తప్పకుండా ఓటు వేస్తున్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆయన పలు సమస్యల తో ఇబ్బంది పడుతున్నారు. చెవులు పూర్తిగా వినిపించక పోవటమే కాదు.. నడవటం కూడా కష్టంగా మారింది. దీనికి తోడు తాజాగా చలి ఎక్కువగా ఉండటం తో మరిన్ని ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఎన్నికల సమయం లో ఆయన ఆరోగ్య పరిస్థితిని పట్టించుకుంటామని.. అవసరమైన సాయాన్నిఇస్తామని చెప్పే నేతలు.. అధికారులు.. తీరా ఎన్నికలు అయ్యాక మాత్రం పట్టించుకోని పరిస్థితి.
ఎవరి సంగతి ఎలా ఉన్నా.. ఇలాంటి విషయాల్లో స్పందించే ప్రధాని మోడీ.. శ్యామ్ విషయంలోనూ రియాక్ట్ అయి.. ఆయనకు నాణ్యమైన వైద్య సేవల్ని అందించాల్సిందిగా కోరుతున్నారు. తాజాగా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న దేశ ప్రథమ ఓటర్ అనారోగ్యం గురించి ప్రధాని మోడీ పట్టించుకుంటారంటారా?