ఘోరం: 1000 రూపాయ‌లు అప్పు తీర్చలేదని.. మహిళపై అత్యాచారం

Update: 2022-11-22 08:32 GMT
దేశంలో అత్యాచారాల‌కు అంతూ పొంతూ లేకుండా పోతోంది. మ‌హిళ‌లు, యువ‌తులకు ర‌క్ష‌ణ నేతి బీర‌లో నెయ్యిగా మారిపోయింది. అనేక చ‌ట్టాలు చేస్తున్నా.. క‌ఠిన శిక్ష‌లు ప‌డుతున్నా.. మృగాళ్లు మాత్రం మార‌డం లేదు. కేవ‌లం వెయ్యి రూపాయ‌లు తిరిగి చెల్లించ‌లేద‌న్న కార‌ణంగా ఓ మ‌హిళ‌పై వ్య‌క్తి దారుణానికి పాల్ప‌డ‌డం సంచ‌ల‌నం సృష్టించింది.

అప్పుగా తీసుకున్న వెయ్యి తిరిగి చెల్లించలేదని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్య‌క్తి. ఈ ఘటన జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లా కుమార్ధుబి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వివాహిత.. విక్కీ రవిదాస్ అనే వ్యక్తి నుంచి రూ.7,000 అప్పు తీసుకుంది. అందులో రూ.6,000 తిరిగి చెల్లించింది.

కాగా మిగిలిన రూ.1,000 కోసం కొద్ది రోజుల నుంచి బాధితురాలిని విక్కీ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో  బాధితురాలు ఒంటరిగా ఇంట్లో ఉండగా వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

"స్నానం చేసి బాత్ రూం నుంచి తన గదిలోకి వెళ్తున్న బాధితురాలిని.. విక్కీ అస్మాత్తుగా వచ్చి వెనుక నుంచి పట్టుకున్నాడు. ఆమె అరిచే లోపే నోట్లో గుడ్డ కుక్కి అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు"అని బాధితురాలు తెలిపిన‌ట్టు పోలీసులు పేర్కొన్నారు. భర్త వచ్చిన తర్వాత జరిగిన విషయన్నంతా అతడికి వివరించింది బాధితురాలు.

దీంతో కోపోద్రిక్తుడైన వివాహిత భర్త.. విక్కీ ఇంటికి వెళ్లి నిలదీశాడు. బరితెగించిన నిందితుడు.. తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తానని బాధితులను బెదిరించాడు.

అనంతరం బాధితురాలి భర్త కుమార్ ధుబి పోలీస్ స్టేషన్కు వెళ్లగా.. అక్క‌డ పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. ఆ తర్వాత వివాహిత భర్త.. కుటుంబ సభ్యులతో సహా వెళ్లగా నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News