ప్రపంచంలోనే అగ్రరాజ్యాల్లో ఒకటైన బ్రిటన్ లో ప్రత్యర్థి రష్యా వర్గం గూఢచర్యానికి పాల్పడుతున్నట్టు ఆ దేశ ఇంటెలిజెన్స్ విశ్లేషణలో తేలింది. ఈ మేరకు అక్కడి ఓ జాతీయ మీడియా సంచలన కథనాన్ని ప్రచురించి బాంబు పేల్చింది. రష్యాకు చెందిన దాదాపు 1000 మందికి పైగా గూఢచారులు వివిధ సంస్థల్లో పనిచేస్తున్నట్లు ఓ అంచనాకు వచ్చారు. శుక్రవారం బెర్లిన్ లోని బ్రిటన్ రాయబార కార్యాలయ సెక్యూరిటీ గార్డ్ ఒకరు మాస్కోకు సమాచారం పంపుతుండగా పట్టుకున్నారు. వీరిని రష్యాకు చెందిన ఫారెన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ నియంత్రిస్తోంది.
ప్రస్తుతం యూకేలో 73వేల మంది రష్యా నిపుణులు పనిచేస్తున్నారు. వీరిలో కూడా కొందరు రష్యాకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నట్లు బ్రిటన్ నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. మినీ క్యాబ్ డ్రైవర్ల నుంచి బారిస్టర్లలో కూడా ఈ వేగులు ఉన్నట్టు గుర్తించారు. లోతైన గూఢచారుల నెట్ వర్క్ ను రష్యా సృష్టించిందని.. వీరంతా సాధారణ పౌరుల్లానే జీవిస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా విద్యార్థులు, ట్రేడ్ యూనియన్లు ఉద్యమ సంస్థలు, టీచర్లు, డ్రైవర్లు, రాజకీయ నాయకులు, సివిల్ సర్వీస్ సిబ్బంది, పోలీసులు ఇలా ప్రతి విభాగంలోనూ ఉన్నట్లు గుర్తించారు.
లండన్ లోని రష్యా రాయబార కార్యాలయ పరిధిలో పనిచేసే గూఢచారుల సంఖ్య తగ్గి అజ్ఞాతంగా పనిచేసే వారి సంఖ్య పెరిగినట్లు సదురు నివేదిక వెల్లడించింది. బ్రిటన్ మాజీ ప్రధాని లిజ్ ట్రస్ విదేశాంగ మంత్రిగా పని చేస్తున్న సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వద్ద పనిచేస్తున్న అనుమానిత ఏజెంట్లు ఆమె ఫోన్‌ను హ్యాక్ చేశారని తేలింది. ఈ ఏజెంట్లు "అంతర్జాతీయ భాగస్వాములతో అత్యంత రహస్య మార్పిడి" విషయాలను సైతం సమీకరించారని సమాచారం.
ట్రస్ ఫోన్ నుంచి వచ్చిన సందేశాలలో ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం గురించి సీనియర్ అంతర్జాతీయ విదేశాంగ మంత్రులతో లిజ్ ట్రస్ చర్చలు ఉన్నాయి. ఆయుధాల రవాణాకు సంబంధించిన వివరాలతో సహా ఉన్నట్టు నివేదికలో పేర్కొంది.
ఏజెంట్లు అప్పటి బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌ను విమర్శిస్తూ ఆమె మిత్రుడు క్వాసీ క్వార్టెంగ్‌తో ట్రస్ సంభాషణలు కూడా బయట పడ్డాయి. డైలీ మెయిల్ ఈ మేరకు కథనం వెలువరించింది. ఒక సంవత్సరం ఆమె ఫోన్ లోని సందేశాలు డౌన్‌లోడ్ చేయబడ్డాయని నివేదిక పేర్కొంది.
ఇలా రష్యాకు చెందిన 1000 మంది ఏజెంట్లు బ్రిటన్ వ్యాప్తంగా విస్తరించి ఇప్పుడు మొత్తం ఈ లీకేజీ చేస్తున్నట్లు సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.