యూట్యూబ్‌ లో తెలుగు బామ్మ హ‌ల్‌ చ‌ల్‌

Update: 2017-04-30 10:44 GMT
100 సంవ‌త్స‌రాల వ‌య‌సులో ఎవ‌రైనా ఏం చేస్తారు? ఇదేం ప్ర‌శ్న‌? మ‌న ముస‌లివాళ్లలో కూడా అంత వ‌య‌స్సు ఉన్న వారు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదే!ఒక‌వేళ బ్ర‌తికి ఉన్న‌ప్ప‌టికీ ఆ వ‌య‌సులో వారేం చేస్తారు? అని అనుకుంటున్నారా? సెంచ‌రీ దాటేసి మ‌రో ఆరేళ్లు కూడా గ‌డిచిపోయిన మ‌న తెలుగు బామ్మ ఇప్పుడు యూట్యూబ్‌లో సో పాపుల‌ర్‌. ఆమె పేరు మ‌స్తాన‌మ్మ‌. ఆంధ్రప్రదేశ్ గుడివాడకు చెందిన వ్య‌క్తి. ఆ మస్తానమ్మ పేరు వింటేనే నోరూరుతుంది. నాలుకపై లాలాజలం ప్రవహిస్తుంది.

106 ఏళ్ల మస్తానమ్మ పేరు త‌లుచుకుంటే ఎందుకిలా అవుతుందంటే.. ఆవిడ వంటలు అంత ఫేమస్. ఆంధ్రప్రదేశ్ గుడివాడకు చెందిన మస్తానమ్మ ఘుమఘుమలు ఇక్కడే కాకుండా.. అమెరికా - ఇంగ్లండ్ - యూరప్ - కరాచీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు వ్యాపించాయి. ఆమె కాంబినేషన్ ఘుమఘుమలకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. ఈ వృద్ధురాలి వంటలకు అభిమాని అయిన పాకిస్థాన్ దేశస్తుడు మస్తానమ్మ 106వ జన్మదినం సందర్భంగా ఆమెకు చీర పంపారంటే అమ్మగారి క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.

మస్తానమ్మ వీడియోలకి యూట్యూబ్‌ లో 43 మిలియన్ల వ్యూస్ ఉన్నాయి. యూట్యూబ్‌ లో మస్తానమ్మ, కంట్రీ ఫుడ్స్ అని సెర్చ్‌ కొడితే.. సుమారు 40కి పైగా వీడియోస్ దర్శనమిస్తాయి. కంట్రీ ఫుడ్స్‌ కి 2,50,000 మంది సబ్ స్కైబర్స్ ఉన్నారు. పుచ్చకాయలో చికెన్ కర్రీ వీడియోకు బీభత్సమైన స్పందన వచ్చింది. ఈ ఒక్క వీడియోనే సుమారు 70 లక్షల మంది చూశారంటే బామ్మ స‌త్తా ఏంటో తెలిసిపోతుంది. మీరూ ఈ సెంచ‌రీ బామ్మ వంట‌ల‌పై ఓ లుక్కువేయండి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News