భవిష్యత్తులో గుర్తుంచుకోవాల్సిన నెంబరు 112

Update: 2015-10-14 05:09 GMT
ఇప్పటికిప్పుడు కాకున్నా.. సమీప భవిష్యత్తులో ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన నెంబరు ‘‘112’’ మారిపోనుంది. ఇప్పటివరకూ పోలీస్ సేవల కోసం 100.. అత్యవసర వైద్య సాయం కోసం 108.. ఇలా ఒక్కోదానికి ఒక్కో నెంబరు ఉంది.

అయితే.. అన్నీ ముఖ్యమైన సేవలకు ఒకే నెంబరును దేశ వ్యాప్తంగా వినియోగించాలన్న ఆలోచన కార్యరూపం దాల్చనుంది. దీంతో.. ఏ సాయం కావాలన్నా కూడా 112 నెంబరుకు ఫోన్ చేస్తే చాలు.. వెనువెంటనే సమాచారం అందటతో పాటు.. ఫోన్ చేసిన వారికి అవసరమైన సాయాన్ని నిమిషాల వ్యవధిలో అందేలా కేంద్రం సన్నాహాలు చేస్తుంది.

ఈ సేవలకు మరికాస్త సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ.. ఈ వ్యవస్థ మొత్తం పూర్తి అయితే మాత్రం అత్యవసర సేవల విషయంలో మరింత మెరుగైన స్పందన ఉంటుందని భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా అందరికి అవసరమయ్యే అత్యవసర సేవల కోసం ‘‘112’’ నెంబరుతో అందించే నిర్ణయం తీసుకున్నారు.

 ఫిర్యాదు దారు దేశంలో ఎక్కడున్నా కూడా.. జీపీఎస్ ఆధారంగా సంబంధిత కాల్ సెంటర్ కు కాల్ వెళ్లేలా చేయటంతో పాటు.. వారికి అవసరమైన సాయాన్ని గుర్తించేందుకు కేవలం  15 సెకన్లు సమయం పట్టేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. దీంతో.. కష్టంలో ఉండే వారికి ఇదో సాంత్వన కలగటమేకాదు.. తక్షణమే సాయం అందే అవకాశం ఉంటుది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 36 చోట్ల 24 గంటలూ పని చేసేలా కాల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం కొందరికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు కూడా.
Tags:    

Similar News