'నోటా'కు 1.29 కోట్ల ఓట్లు పోలయ్యాయా ?

Update: 2022-08-05 15:30 GMT
మెల్లిగా నన్ ఆఫ్ ది ఎబోవ్ (నోటా)కు జనాల ఆదరణ పెరుగుతోంది. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్ధుల్లో ఎవరికీ ఓట్లువేయటానికి ఇష్టపడనపుడు ప్రత్యామ్నాయంగా జనాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆప్షనే నోటా. 2018-2022 మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు 65 లక్షల 23 వేల 975 ఓట్లు పోలయైనట్లు ఎసోసియేషన్ ఫర్ డెమక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)+ఎలక్షన్ వాచ్ అనే సామాజిక సంస్ధలు బయటపెట్టాయి. గడచిన ఐదేళ్ళల్లో నోటాకు 1.29 కోట్ల ఓట్లు పోలయ్యాయట.

ప్రతి ఎన్నికకు నోటాకు జనాల ఆదరణ పెరుగుతున్న విషయం స్పష్టంగా బయటపడుతోందని పై సంస్ధలు తెలిపాయి. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలని తేడా లేకుండా నోటాకు ఓట్లు పెరుగుతున్నాయి. బీహార్లోని లోక్ సభ నియోజకవర్గం గోపాల్ గంజ్ లో అత్యధికంగా 51 వేల ఓట్లు పోలయ్యాయి.

అలాగే అసెంబ్లీ ఎన్నికలు లేదా ఉపఎన్నికల్లో కూడా ఆదరణ పెరుగుతోంది. ఏపీలో మొన్నటి సాధారణ ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తక్కువలో తక్కువ సగటున 2 వేల ఓట్లు పోలవ్వటం మామూలు విషయం కాదు.

చాలా నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలకు పడిన ఓట్ల కన్నా నోటాకు పడిన ఓట్లే చాలా ఎక్కువ. 2019లో మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ నియోజకవర్గాల్లో కలిపి 7,42,134 ఓట్లు పోలయ్యాయి. ముగ్గురు లేదా నలుగురి కన్నా ఎక్కువమంది క్రిమినల్ రికార్డులున్న అభ్యర్థులు పోటీ చేసిన చోట్ల 2018 నుండి లెక్కలు తీసుకుంటే 28,77,616 ఓట్లు పోలైనట్లు ఏడీఆర్ ప్రకటించింది.

నోటాకు ఆదరణ ఎందుకు పెరుగుతోందంటే అభ్యర్ధుల్లో కొందరికి ఉన్న క్రిమినల్ రికార్డు, అభ్యర్ధుల ట్రాక్ రికార్డు లేదా పార్టీల ట్రాక్ రికార్డు నచ్చని కారణంగానే జనాలు నోటాకు ఓట్లేయటానికి మొగ్గుచూపుతున్నారు.

రాజకీయాల్లో నేరగాళ్ళు పెరిగిపోతుండటం, పార్టీలు కూడా వాళ్ళకి టికెట్లివ్వటానికి ప్రాధాన్యత ఇస్తున్న కారణంగానే నోటాకు పడే ఓట్లు పెరిగిపోతున్నాయి. ఎన్నికల్లో నేరగాళ్ళ పోటీ అనేది ఏ ఒక్కపార్టీకో పరిమితమైనది కాదు. అన్నీ పార్టీలు అలాగే ఉన్నాయి కాబట్టే నోటాకు ఆదరణ పెరిగిపోతోంది.
Tags:    

Similar News