బాబుకు టచ్ లో లేని 15మంది టీడీపీ ఎమ్మెల్యేలు.!?

Update: 2019-06-20 11:33 GMT
టీడీపీ ముసలం ముదిరిపాకాన పడుతోంది. అటు ఢిల్లీలో.. ఇటు కాకినాడలో జరుగుతున్న పరిణామాలు టీడీపీని షేక్ చేస్తున్నాయి. ఈ పరిణామాలతో టీడీపీలో సంక్షోభం ఖాయంగా కనిపిస్తోంది. అయితే గోరుచుట్టపై రోకలిపోటులా ఇప్పుడు 15మంది టీడీపీ ఎమ్మెల్యే అధినేత చంద్రబాబుతో టచ్ లో లేకుండా పోయారన్న వార్త టీడీపీనీ తీవ్రంగా కలవరపెడుతోంది.

ఇప్పటికే టీడీపీ తరుఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది తనతో టచ్ లో ఉన్నారని స్వయంగా అసెంబ్లీలోనే జగన్ ప్రకటించారు.  ఇప్పుడు ఢిల్లీలో నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరికకు రంగం సిద్దం చేసుకోవడం.. ఇక కాకినాడలో టీడీపీ సీనియర్ నేత తోట త్రిముర్తులు నేతృత్వంలో కాపు నేతలు, మాజీ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కావడంతో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకు యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి..

విదేశాల్లో ఉన్న చంద్రబాబు ఈ సంక్షోభం నేపథ్యంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో విదేశాల నుంచే ఫోన్ ద్వారా టచ్ లోకి రావడానికి ప్రయత్నించగా.. 15 మంది ఎమ్మెల్యేలు స్పందించలేదని తెలిసింది. దీంతో వీరు కూడా బీజేపీలోకి జంప్ చేస్తారా అన్న టెన్షన్ ఇప్పుడు టీడీపీని షేక్ చేస్తోంది.

అటు నలుగురు ఎంపీలు ఇప్పటికే బీజేపీలోకి జంప్ చేయడానికి సిద్ధం కావడం.. 15మంది టీడీపీ ఎమ్మెల్యేలు బాబుతో టచ్ లో లేకపోవడంతో టీడీపీలో సంక్షోభం ముదిరిపోతోంది. కేవలం 8 మంది మాత్రమే ఎమ్మెల్యేలు బాబు వెంట ఉండే అవకాశం ఉంది. ఇదే జరిగితే వచ్చే 5 ఏళ్లలో టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుందోనన్న టెన్షన్ ఆ పార్టీని వెంటాడుతోంది. టీడీపీని లేకుండా చేయాలని ఓ వైపు బీజేపీ, ఇటు వైసీపీ కంకణం కట్టుకున్న నేపథ్యంలో టీడీపీని చంద్రబాబు ఎలా కాపాడుకుంటారన్నది వేచిచూడాలి.

    

Tags:    

Similar News