డేరా బాబా దెబ్బ‌కు 1500 మంది ఖైదీలు విల‌విల‌

Update: 2017-09-06 11:01 GMT
ఇద్ద‌రు స్వాధీల‌ను అత్యాచారం చేసిన కేసులో జైలుశిక్ష అనుభ‌విస్తున్న డేరా బాబా అలియాస్ రామ్ ర‌హీం ప్ర‌స్తుతం రోహ‌త‌క్ లోని సునియారా జైల్లో ఉంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ జైల్లో ఆయ‌న‌తో పాటు మ‌రో 1500 ఖైదీలు ఉంటున్నారు. డేరా బాబా ఎప్పుడైతే జైల్లోకి అడుగు పెట్టాడో.. అప్ప‌టి నుంచి జైల్లోని 1500 మంది ఖైదీల‌కు చుక్క‌లు క‌నిపిస్తున్నాయ‌ట‌.

గుర్మీత్ జైల్లోకి వ‌చ్చిన నాటి నుంచి  జైల్లోని ఇత‌ర ఖైదీల మీద విప‌రీత‌మైన ఆంక్ష‌ల్ని విధిస్తున్నార‌ట‌. దీంతో.. వారికి ఉండే క‌నీస స్వేచ్ఛ లేక‌పోవ‌టంతో జైలు బ్యారెక్ ల‌లోనే మ‌గ్గిపోతున్నార‌ట‌. దీంతో.. గుర్మీత్ మీద తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. బాబా రాక‌తో జైల్లో భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేయ‌టంతో మిగిలిన వారికి తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్నార‌ట‌.

గుర్మీత్ జైల్లోకి రాక ముందు వ‌ర‌కూ ఖైదీలు రోజూ రెండు గంట‌ల పాటు తిరిగేందుకు అవ‌కాశం ఉండేద‌ని.. ఎప్పుడైతే బాబా జైల్లోకి అడుగు పెట్టాడో అప్ప‌టి నుంచి ఖైదీల‌ను బ‌య‌ట‌కు అడుగు పెట్ట‌నివ్వ‌టం లేద‌ని తెలుస్తోంది. చివ‌ర‌కు ఖైదీల‌ను క‌లిసేందుకు వ‌చ్చే వారికి సైతం ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ట‌. అందుకే.. జైల్లోని బాబాను వేరే జైలుకు త‌ర‌లించాల‌ని 1500 మంది ఖైదీలు కోరుకుంటున్నార‌ట‌.
Tags:    

Similar News