అమెరికా పైనుండే కెనడా దేశంలో వలసలు ఎక్కువ. అమెరికా తర్వాత ఆ స్థాయిలో ప్రపంచదేశాల వారు ఈ దేశానికి వెళుతుంటారు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వలస విధానాలను సంస్కరించిన ఈ దేశంలో ఇప్పటికీ భారతీయుల జనాభా కూడా అధికంగానే ఉంది.
కెనడా జనాభాలో 23 శాతం మంది భూస్వామ్య వలసదారులుగా దేశంలో శాశ్వత నివాసితులుగా ఉన్నారని ఒక కొత్త నివేదిక బయటపెట్టింది. "పోర్ట్రెయిట్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ టు కెనడా" అనే పేరుతో వెలువడ్డ ఈ నివేదికలో కెనడాలో మొత్తం 8.3 మిలియన్ల మంది వలసదారులు (వివిధ దేశాల వారు) ఉన్నారు. ఇది కెనడా జనాభాలో అతిపెద్ద వలసదారుల వాటాగా నిలిచింది.
2041 నాటికి కెనడా వలస జనాభా 34% వరకు పెరుగుతుందని గణాంకాలు అంచనా వేసింది. 2016 -2021 మధ్య 1.3 మిలియన్లకు పైగా కొత్త శాశ్వత నివాసితులు కెనడాలో స్థిరపడ్డారు. వీరిలో సగానికి పైగా ఆర్థిక తరగతి కిందకు వచ్చారు. వీరిలో మూడింట ఒక వంతు మంది శాశ్వత నివాసం పొందడానికి ముందు కెనడాలో నివసించారు. 2016 -2021 మధ్య కెనడా శ్రామిక శక్తి వృద్ధిలో 80% వలసదారులు ఉన్నారని డేటా చూపించింది.
కెనడాకు వలస వచ్చినవారిలో ఆసియన్లు అగ్రస్థానంలో ఉన్నారని నివేదిక వెల్లడించింది. ఇటీవలి వలస వచ్చినవారిలో 62% మంది ఆసియాలో జన్మించారు. ఇందులో 18.6% మంది భారతదేశం నుండి వస్తున్నారు. ఫిలిప్పీన్స్ 11.4% మంది.., చైనా నుంచి 8.9% మంది ఉన్నారు.
ప్రతీ ఐదుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది కెనడియన్లు పదవీ విరమణ వయస్సు సమీపంలో ఉన్నారని తేల్చింది. అంటే కెనడా వాసుల వృద్ధ జనాభా పెరుగుతోంది. 2016 -2021 మధ్య కెనడాకు వచ్చిన కొత్త వలసదారులలో దాదాపు 10.9% మంది 15 -24 సంవత్సరాల వయస్సు గల యువకులు ఉండడం విశేషం. అత్యధికులు 25 నుండి 25 సంవత్సరాల మధ్య ఉన్న కోర్-వయస్సు గల కార్మికులుగా తేలింది. కొత్తగా వచ్చిన వారిలో 15 ఏళ్లలోపు పిల్లలు 17.1% దేశంలో నివాసం ఉంటున్నారు.
2022లో కెనడా దేశంలో దాదాపు 432,000 మంది కొత్త వలసదారులను స్వాగతించాలని చూస్తోంది. ఇలా సరిపడా.. భూమి, వనరులు ఉన్న అతిపెద్ద దేశం.. దాదాపు అమెరికా అంత విస్తీర్ణం ఉన్న కెనడాలో ఆ స్థాయిలో జనాభా లేదు. అందుకే సరిపడా విదేశీయులను ఆకర్షించాలని చూస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.