రికార్డు స్థాయిలో హైదరాబాద్ కాన్సులేట్ స్టూడెంట్స్ వీసాల జారీ..!

Update: 2023-01-06 04:37 GMT
ప్రస్తుతం అమెరికాలో కరోనా ప్రభావం తగ్గడంతో భారతీయులు ఉన్నత విద్య కోసం ఆ దేశానికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. చైనాలో కరోనా ప్రభావం.. ఉక్రెయిన్-రష్యా వార్ నేపథ్యంలోనే భారతీయులు అటు వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే అమెరికా.. కెనడా.. బ్రిటన్.. ఆస్ట్రేలియా వంటి దేశాలు జారీ స్టూడెంట్స్ వీసాల కోసం ఆసక్తి కనబరుస్తున్నారు.  

2016 ఏడాది తర్వాత అత్యధికంగా అమెరికా 2022 ఏడాదిలో భారీగా స్టూడెంట్ వీసాలను మంజూరు చేసింది. అమెరికా 2022లో ఏకంగా ఒక లక్షా 25 వేల స్టూడెంట్ వీసాలను జారీ చేసింది. ఈ సంఖ్య గత ఐదేళ్లతో పోలిస్తే రికార్డు స్థాయిలో ఉండటం గమనార్హం. ప్రస్తుతం యూఎస్ లోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య 20 శాతం ఉంది.

2022 సంవత్సరంలో హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ నుంచి తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు 18వేల 600 వీసాలు జారీ అయ్యాయి. మరిన్ని వీసాలు జారీ చేయడంతో పాటు వీసాల కోసం ఉండే సమయాన్ని తగ్గించడంపై కసరత్తులు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్ ఫ్రైస్ తెలిపారు.

కరోనా పరిస్థితులు.. సిబ్బంది కొరత కారణంగా భారత్ సహా కొన్ని దేశాలకు చెందిన వీసాల మంజూరు పెండింగ్ లో పడిందని ఆయన తెలిపారు. ఇటీవల వీసాల జారీ కొత్త సిబ్బంది నియామకం చేపట్టినట్లు తెలిపారు. దీంతో పెండింగ్ వీసాల మంజూరు ప్రక్రియ త్వరితంగా పూర్తవుతుందని నెడ్ ఫ్రెస్ వివరించారు.

ఈ ఏడాదిలోగా కోవిడ్ ముందు నాటి స్థితికి వీసాల జారీ ప్రక్రియ చేరుకుంటుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అన్ని దేశాల్లో కరోనా తగ్గుముఖం పట్టడం ఆంక్షలు సడలించాయని తెలిపారు. ఈ మేరకు అమెరికా వీసాలకు మళ్లీ డిమాండ్ పెరిగిందని తెలిపారు. భారత్ సహా వివిధ దేశాల నుంచి చాలామంది విద్యార్థులు వీసాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారని తెలిపారు.

వీరందరికీ వీలైనంత త్వరగా వీసాలు అందించే ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ఏది ఏమైనా గతేడాదిలో అమెరికా భారతీయ స్టూడెంట్ కోసం జారీ చేసి 1.25లక్షల వీసాల సంఖ్యలో తెలుగు రాష్ట్రాల నుంచి 18 వేల 600 మంది విద్యార్థులు ఉండటం గమనార్హం. దీనిని బట్టి మన స్టూడెంట్స్ అమెరికాలో ఉన్నత విద్య కోసం ఎంత ఆసక్తిని చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News