అర‌గంట‌లో రిజైన్ చేయాల‌న్న ప్ర‌ముఖ ఐటీ సంస్థ‌

Update: 2018-07-19 07:29 GMT
భారీ ట‌ర్నోవ‌ర్.. అంత‌కు మించి లాభాల‌తో ఉన్న ఒక ఐటీ కంపెనీ త‌న ఉద్యోగుల విష‌యంలో వ్య‌వ‌హ‌రించిన తీరు ఇప్పుడా సంస్థ‌ను వార్త‌ల్లోకి ఎక్కేలా చేసింది. టెక్ కంపెనీల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన హైద‌రాబాద్ లో సీడీకే  గ్లోబ‌ల్ ఇండియా సంస్థ గ‌త వారంలో 180 మంది ఉద్యోగుల‌కు పింక్ స్లిప్పులు ఇచ్చిన వైనం ఐటీ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది.

రూల్స్ ను పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా.. కంపెనీకి అక్క‌ర్లేని ఉద్యోగుల విష‌యంలో వ్య‌వ‌హ‌రించిన తీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ర‌హేజా మైండ్ స్పేస్ లో ఉన్న ఈ కంపెనీ మొత్తంలో ప్ర‌స్తుతం 1400 మంది ఉద్యోగులు ఉన్నారు. మూడేళ్ల క్రితం 800 మంది ఉద్యోగులున్నారు. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఉద్యోగ క‌ల్ప‌న‌లో పెద్ద ఎత్తున వృద్ధి రేటును న‌మోదు చేస్తున్న ఈ కంపెనీ అందుకు భిన్నంగా ఉద్యోగుల్ని తీసేయ‌టంలోనూ త‌న‌దైన పంథాను పాటిస్తుంద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఉద‌యం ఆఫీసుకు వ‌చ్చిన ఉద్యోగుల‌కు అర‌గంట టైమిచ్చి.. రాజీనామా చేసి వెళ్లిపోవాల్సిందిగా హెచ్ ఆర్ సిబ్బంది ఆర్డ‌ర్ వేశార‌ని.. ఎలాంటి ప్యాకేజీలు ఇవ్వ‌లేద‌ని వారు వాపోతున్నారు. రూల్స్ మాట్లాడే ప్ర‌య‌త్నం చేసిన ఉద్యోగుల విష‌యంలో అయితే.. అలా మాట్లాడితే మ‌రే కంపెనీలోనూ ఉద్యోగాలు దొర‌క్కుండా చేస్తామ‌ని బెదిరించిన‌ట్లుగా వ్యాఖ్యానించారు.

ఉద్యోగుల్ని తొల‌గించే విష‌యంలో కంపెనీ రూల్స్ ను పూర్తిగా బ్రేక్ చేసిన‌ట్లేన‌ని ఫోర‌మ్ ఫ‌ర్ ఐటీ ప్రొఫెష‌న‌ల్స్ ప్ర‌తినిధి ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం కార్మిక చ‌ట్టాల అమ‌లు విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌టం వ‌ల్లే ఐటీ రంగంలో అడ్డ‌గోలుగా లేఆఫ్ లు ఎక్కువ అయిన‌ట్లుగా బాధితులు వాపోతున్నారు. గ‌డిచిన ఏడాదిలో ముంద‌స్తు నోటీసులు ఇవ్వ‌కుండా లేఆఫ్ లు ప్ర‌క‌టించ‌టం కంపెనీల‌కుఅల‌వాటుగామారింద‌ని.. లేబ‌ర్ డిపార్ట్ మెంట్ దృష్టికి ఇలాంటి అంశాల్ని తీసుకెళ్లినా వారు స్పందించ‌టం లేద‌ని చెబుతున్నారు. ఐటీ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై మాట్లాడ‌టానికి కార్మిక మంత్రి కూడా ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించ‌టం లేద‌ని ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు.


Tags:    

Similar News