‘ఢిల్లీ ర్యాలీ’ కేసుల్లో 19 మంది అరెస్ట్​..!

Update: 2021-01-28 11:45 GMT
జనవరి 26న ఢిల్లీ రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీలో ఆందోళనకారులు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. ఢిల్లీ ఎర్రకోటపై వివాదాస్పద జెండాలు ఎగరవేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులు, ఎన్​ఐఏ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటివరకు 25కు పైగా క్రిమినల్​ కేసులు నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీస్​ కమిషనర్​ తెలిపారు. మొత్తం 19 మందిని అరెస్ట్​ చేశామన్నారు. అంతేకాక కిసాన్​ పరేడ్​లో గాయపడ్డ పోలీసులను కేంద్ర హోమ్ మంత్రి అమిత్​ షా పరామర్శించనున్నారు.

ఢిల్లీలోని ఎర్రకోటను కూడా ఆయన సందర్శిస్తారని సమాచారం. తీరథ్, సుశ్రుత్ ట్రామా సెంటర్లలో పోలీసులు చికిత్సపొందుతున్నారు. అయితే రైతుల దాడిలో మొత్తం 394 మంది పోలీసులు గాయపడ్డారు.ఢిల్లీలో జరిగిన రైతుల ఆందోళన దారి తప్పిన విషయం తెలిసిందే. అన్నదాతలు ట్రాక్టర్​ ర్యాలీ ప్రారంభమయిన కొద్దిసేపటికే వ్యూహం మార్చారు. ఎర్రకోటమీదకు దూసుకెళ్లారు. అయితే ర్యాలీ దారిమళ్లడానికి కారణమని సంఘవిద్రోహ శక్తులేనని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పోలీసులు ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరుపుతున్నారు. మరోవైపు రైతు సంఘాల్లో చీలిక రావడంతో కొందరు ఆందోళన విరమించారు. టెంట్లు తీసేసి చిల్లా సరిహద్దులను ఖాళీ చేశారు.నిన్నటిదాకా రైతుల ఆందోళనలతో నిండిపోయిన ప్రాంతమంతా ఇప్పుడు ఖాళీగా కనిపిస్తోంది. పోలీసుల బారికేడ్లు మాత్రమే ఉన్నాయి. దీంతో యూపీ-నోయిడా నుంచి ఢిల్లీ వైపు రాకపోకలు అనుమతిస్తున్నారు. టిక్రి సరిహద్దుల్లో మాత్రం రైతుల ఆందోళన కొనసాగుతోంది.


Tags:    

Similar News