సీఎం సంతకాన్నే ఫోర్జరీ చేసి 2కోట్లకు ఎసరు

Update: 2021-06-12 08:30 GMT
సీఎం జగన్ సంతకాన్ని ఫోర్జరీ చేసేశాడు. ఆ తర్వాత సీఎం పేషీలో సలహాదారుడిని అంటూ ఏకంగా ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి కోట్లు కొల్లగొట్టాడు ఓ కేటుగాడు. ఈ విషయం ఇప్పుడు తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ఏకంగా సీఎం, ఉన్నతాధికారులను షేక్ చేసిన ఈ వైనం సంచలనమైంది.

ఏపీలో భారీగా దోచుకున్న కేటుగాడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం ఇసుకకు ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో ఆ డిమాండ్ ను క్యాస్ చేసుకున్న ఓ మాయగాడు.. కొందరికీ ఆశ చూపించాడు. ఇసుక రీచ్ లను సబ్ లీజుకు ఇప్పిస్తానని నమ్మించాడు.

అందుకు సంబంధించిన అనుమతి పత్రాల కోసం నేరుగా ఉన్నతాధికారుల సంతకాలనే ఫోర్జరీ చేశాడు. ఆ పత్రాలతో ఏకంగా రెండు కోట్ల రూపాయలు వసూలు చేశాడు.

చివరకు ఈ మోసం వెలుగులోకి రావడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. నిందితుడు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల ఐఏఎస్ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలతో మోసగిస్తున్నట్టు తేలడంతో పోలీసులు విస్తుపోయారు.

సుధాకర్ ఇన్ ఫ్రాటెక్ ప్రతినిధులుగా చెప్పుకుంటున్న ప్రవీణ్ కుమార్, శ్రీనివాసరావు, నాగమల్లేశ్వరరావులను అదుపులోకి తీసుకొని విచారిస్తే సీఎం జగన్ తోపాటు ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసినట్టు తేలింది. వీరి మాటలు నమ్మి ఇసుక కాంట్రాక్ట్ కోసం 2 కోట్ల రూపాయలను సంస్థలు చెల్లించాయి.
Tags:    

Similar News