కమల్ పార్టీ వెబ్‌ సైట్‌ కు 2 రోజుల్లో 2 లక్షల సభ్యులు

Update: 2018-02-28 16:31 GMT
   
రాజకీయ పార్టీ పెట్టిన కమల్ హసన్‌ కు డిజిటల్ ప్లాట్ ఫాంలో జనాదరణ దక్కుతోంది. ఆయన పార్టీ మక్కల్ నీది మయ్యమ్ వెబ్ సైట్ లాంచ్ చేసిన తరువాత 48 గంటల్లో 2 లక్షల మందికిపైగా సభ్యులుగా నమోదు చేసుకున్నారు. దీంతో ఆ పార్టీ తెగ సంతోష పడుతోందట.
    
సరిగ్గా వారం కిందట.. అంటే ఫిబ్రవరి 21న మధురైలో కమల్ హాసన్ తన పార్టీని ప్రకటించారు. అదే రోజు రాత్రి 7.27 నిమిషాలకు పార్టీ వెబ్ సైట్ లాంఛ్ చేశారు. అప్పటి నుంచి 48 గంటల్లో 2,01,597 మంది సభ్యులు చేరినట్లు పార్టీ అధికార ప్రతినిధి అందుకు సంబంధించిన గూగుల్ ఎనలిటిక్స్ డాటాను వెల్లడించారు.
    
కాగా సభ్యులుగా నమోదు చేసుకున్న వారిలో అమెరికా, అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, బ్రిటన్, మలేసియా, సౌదీ నుంచి కూడా రిజిస్ట్రేషన్లు ఉన్నాయని తెలిపారు. అయితే... ఈ 2 లక్షల మందిలో తమిళనాడుకు చెందిన ఓటర్లు ఎంతమంది అన్నది తెలియాల్సి ఉంది.
    
మరోవైపు ఆన్ లైన్ సపోర్టుకు ఆఫ్ లైన్ సపోర్టుకు తేడా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కమల్ హాసన్ అంటే అభిమానం ఉన్నవారు పార్టీ వెబ్ సైట్లో సభ్యులుగా నమోదైనంత మాత్రాన వారంతా సీరియస్ సపోర్టర్లు కారని ఆయన విమర్శకులు అంటున్నారు.
Tags:    

Similar News