స్నేహమంటే ఇది.. స్నేహితులంటే ఇలా ఉండాలి. కష్టకాలంలోనే కాదు.. మరణం తర్వాత కూడా నీ వెంట నడిచేదే నిజమైన స్నేహం. ఈ కశ్మీరీ యువకులు ఫ్రెండ్ షిప్ కు సరికొత్త అర్థం చెప్పారు. తమ ప్రాణమిత్రుడు - జమ్ముకశ్మీర్ వీర జవాన్ ఔరంగజేబు మృతికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ దోస్తులంతా ఒక్కటయ్యారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 50 మంది కలిశారు. ఎక్కడో సుదూరంగా సౌదీ అరేబియా - మస్కట్ - కువైట్ లలో ఉద్యోగాలు చేసుకునే వీరంతా తమ ‘ఉమ్మడి’ లక్ష్యం కోసం ఊరి బాట పట్టారు. ఔరంగజేబును కర్కశంగా కాల్చిచంపిన ముష్కర మూకల్ని హతమార్చడమే వీరి లక్ష్యం. ఈ ఆప్త బృందంలో ఔరంగజేబు ప్రాణ మిత్రులతో పాటు - బంధువులు - గ్రామస్థులు ఉండడం విశేషం.
జమ్ముకాశ్మీర్ లో ఉగ్రవాదుల చేత దారుణహత్యకు గురైన ఆర్మీ జవాను ఔరంగజేబ్ ఉదంతం మలుపులు తిరుగుతోంది. జమ్ముకశ్మీర్ కు చెందిన లైట్ ఇన్‌ఫాంట్రీలో ఔరంగ జేబ్ రైఫిల్ మ్యాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కరడుగట్టిన హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాది సమీర్ టైగర్ ను మట్టుబెట్టడంలో ఔరంగజేబు కీలక పాత్ర పోషించాడు. అందుకు ప్రతికారంగానే ఈ హత్య జరిగిందని, అలాగే ఈ హత్యవెనుక పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ ఐ హస్తం ఉన్నట్లు నిఘావర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామం ఇలా ఉండగా...తమ సోదరుడిని పొట్టనబెట్టుకున్నవాళ్లను అంతం చేయాలని విదేశాల్లోని ఉద్యోగాలకు రాజీనామా చేసిన 50 మంది యువకులు స్వగ్రామానికి వచ్చారు.
జూన్ 14న ఉగ్రవాదుల చేతిలో జవాన్ ఔరంగజేబు దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం సౌదీలోని అతడి స్నేహితులు మహమ్మద్ కిరామత్ - మహమ్మద్ తాజ్ సహా అందరూ కలిసి శ్రీనగర్ కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెంధర్ తాలుకా పరిధిలోని తమ స్వగ్రామమైన సలానికి చేరుకున్నారు. ఔరంగజేబు అంత్యక్రియల అనంతరం అతడి ఇంట్లో స్నేహితులు - బంధువులు - గ్రామస్థులు సమావేశమై హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని శపథం చేశారు. దీనిపై అతడి స్నేహితుడు మొహమ్మద్ కిరామత్ మాట్లాడుతూ.. ‘ఔరంగజేబు మృతి వార్త వినగానే మేమంతా తీవ్ర ఆవేదనకు గురయ్యాం. ఇక ఒక్క క్షణం కూడా సౌదీలో ఉండలేకపోయాం. వెంటనే ఉద్యోగాల్ని వదిలిపెట్టి భారత్ కు బయలుదేరాం. నాతో పాటు మొత్తం 50 మంది యువకులం ఇక్కడికి చేరుకున్నాం. ఔరంగజేబును హత్యచేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడమే మా లక్ష్యం. ఆర్మీ - పోలీసులతో చేతులు కలిపి ఉగ్రవాదులను మట్టుబెడతాం’ అని అన్నారు. తాము సౌదీకి తిరిగి వెళ్లమని ఇక్కడే శాశ్వత నివాసాలు ఏర్పాటుచేసుకుని ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతామని చెప్పారు. ‘ఔరంగజేబు తన పని తాను చేసుకుంటూ వెళ్లేవాడు. ఎవరినీ ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలు లేవు. అతడికి ఎప్పుడూ ప్రాణాపాయం కూడా లేదు. కనీసం తనను ఉగ్రవాదులు టార్గెట్ చేశారన్న సంకేతాలు కూడా లేవు’ అని బంధువు ఒకరు విలపించారు. ఔరంగజేబు వీర మరణం తర్వాత ఉగ్రవాదులు ఇద్దరు పోలీసులతోపాటు మరో సీఆర్ పీఎఫ్ జవానును కూడా దారుణంగా కాల్చిచంపారు. ఔరంగజేబు తండ్రి ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ కాగా - సోదరుడు ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్నాడు.