విమానంలో మాస్కు పెట్టుకోకుండా రచ్చ చేసినందుకు 20 ఏళ్ల జైలు!

Update: 2021-03-17 05:30 GMT
ఫ్లైట్ లో తాగటం నేరం కానే కాదు. ఎందుకంటే.. విమాన ప్రయాణంతో లిక్కర్ సర్వ్ చేయటం మామూలే. అయితే.. తాగామా? మన పని ఏదో మనం చేసుకున్నామా? చుట్టూ ఉన్న ప్రయాణికులకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ఉన్నామా? అన్నదే ముఖ్యం. అంతేకానీ తాగాం కాబట్టి.. విమానంలో రచ్చ రచ్చ చేస్తామంటే అస్సలు ఒప్పుకోరు సరి కదా.. శిక్షలు తీవ్రంగా ఉంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే అమెరికాలోచోటు చేసుకుంది. తాగి రచ్చ రచ్చ చేసిన అ యువకుడికి పడే శిక్ష లెక్క తెలిస్తే అవాక్కు కావటమే కాదు.. షాక్ తినటం ఖాయం. ఇంతకీ అతగాడు చేసిన రచ్చ ఏ రేంజ్ లో ఉందో చూస్తే..

కొలరాడోకు చెందిన 24 ఏళ్ల లాండన్ గ్రియర్ మార్చి తొమ్మిదిన అలాస్కా ఎయిర్ లైన్ విమానంలో ప్రయాణించాడు. విమానం ఎక్కిన తర్వాత నుంచి ముఖానికి మాస్కు పెట్టుకోవాలని విమాన సిబ్బంది పదే పదే కోరారు. అయినా.. అదేమీ పట్టనట్లుగా అతడు దొంగ నిద్రను నటించాడు. ఓపక్క కరోనా కేసులు భారీగా నమోదవుతున్న అమెరికాలో.. మాస్కు పెట్టుకోవటం తప్పనిసరిగా అమలు చేస్తున్నారు.

అయితే.. సిబ్బంది ఎంత చెప్పినా పట్టించుకోకపోవటమే కాదు.. తన సీట్లో తానే మూత్ర విసర్జన చేసి.. ఆగమాగం చేశాడు. తోటి ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడేలా చేశాడు. దీంతో.. విమానం ల్యాండ్ అయిన వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సీటెల్ నుంచి డెన్వర్ కు విమానం ఎక్కే సమయంలో మూడు నుంచి నాలుగు బీర్లు తాగనని.. విమానంలో ఏం జరిగిందో తనకు తెలీదని చెప్పాడు. విమాన సిబ్బందిని కొట్టినట్లుగా కూడా తనకు తెలీదని వాదించాడు.

తనకేమీ తెలీదని అమాయకంగా మాటలు చెబుతున్న డెన్వర్ విమానంలో చేసిన పనులు అసహ్యకరంగానే కాదు.. నోటితో చెప్పలేనట్లుగా ఉండటం గమనార్హం. మాస్కు పెట్టుకోవాలని కోరిన విమాన సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించటమే కాదు.. ప్యాంట్ విప్పి అసహ్యంగా ప్రవర్తించాడు కూడా. చివరకు అతడి చేష్టలకు విసిగిపోయిన సిబ్బంది.. అతని పద్దతి మార్చుకోవాలని చెప్పినా వినలేదు. అంతేనా.. తన సీటుపైనే మూత్ర విసర్జన లాంటి అసహ్యకరమైన పనికి తెర తీశారు. ఇతడి తీరుతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు.

ఇతడు చేసిన నేరాలను నమోదు చేసిన అధికారులు కేసు ఫైల్ చేశారు. ప్రస్తుతానికి 10వేల డాలర్ల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ పొందాడు. ఒకవేళ ఇతడిపై ఆరోపించిన నేరాలు కానీ ఖరారైతే 20 ఏళ్ల జైలుతో పాటు రూ.2కోట్ల జరిమానాను చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. తిన్నది అరగక.. తాగింది ఎంత ఎక్కితే మాత్రం అంత రచ్చ చేయాలా? అయినా.. మూడు నాలుగు బీర్లకే పైత్యం అంతలా ప్రకోపించే ఛాన్సు ఉందంటారా?
Tags:    

Similar News