రిషి-అక్షతమూర్తిలపై గూగుల్ లో ఒక్కరోజులో 200 కోట్ల సెర్చ్ లు

Update: 2022-10-27 13:30 GMT
ఇప్పుడంటే అమెరికా హవా.. కానీ ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించింది బ్రిటీష్ సామ్రాజ్యం.. అమెరికాతోపాటు భారత్ సహా రవి అస్తమించని సామ్రాజ్యాన్ని సృష్టించుకుంది. అలాంటి బ్రిటన్ దేశం ఇప్పుడు నాయకత్వ లోపంతో ఇతర దేశాల వారు పాలించే స్థితికి దిగజారింది. భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని కావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతడు ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటని ఆరాతీస్తున్నారు.

బ్రిటీష్ ప్రధానమంత్రిగా రిషి సునక్ నియామకం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు గర్వంగా చెప్పుకుంటున్నారు. గ్రేట్ బ్రిటన్ కు మొదటి శ్వేతజాతీయేతర , హిందూ ప్రధాన మంత్రిగా రిషి చరిత్ర సృష్టించాడు. రిషితో పాటు, అతని భార్య.. ఇన్ఫోసిస్ బిలియనీర్ నారాయణ మూర్తి -సుధా మూర్తి కుమార్తె అక్షతా మూర్తి కూడా మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఈ జంట గురించే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ సెర్చ్ చేస్తున్నారు.

అక్టోబర్ 26వ తేదీన  రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ప్రకటించగానే ఆ  ఒక్కరోజే దాదాపు 200 కోట్ల మంది గూగుల్‌లో రిషి - అక్షత జంట గురించి వెతికారు. సోమవారం అక్షతా మూర్తి పేరుపై 1 లక్షకు పైగా శోధనలు గూగుల్ లో జరిగాయి. గూగుల్ లో రిషి సునక్ పేరుపై 2 మిలియన్లకు పైగా శోధన ప్రశ్నలు నమోదు చేయబడ్డాయంటే ఈ జంటకు ఉన్న క్రేజ్ ను అర్తం చేసుకోవచ్చు..

ట్విట్టర్‌లో అక్టోబర్ 24 నుండి  దాదాపు 6,80,000 ట్వీట్‌లు పోస్ట్ చేయబడ్డాయి. ఆసక్తికరంగా రిషి గొడ్డు మాంసం తినే ఎంపిక వివాదం గురించి వీడియోలు పోస్టులు పడ్డాయి. రిషి సునక్ మతం, వయస్సు, అతని ఆహార ప్రాధాన్యతలపై ఈ శోధనలు జరిగాయి. సోషల్ మీడియా పోస్ట్‌లు చాలా వరకు వీరి గురించే వెతకడం.. పోస్టులు పెట్టడం జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల సెర్చ్ లు అంటే ఈ జంటపై జనాలు ఎంతగా ఆసక్తి కనబరిచారో అర్తం చేసుకోవచ్చు..



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News