రూ.2000 నోట్లు మరో రెండు రంగుల్లో రానున్నాయి. పెద్ద నోట్ల రద్దుకు ముందు కొత్త 2000 నోటు ఇదేనని సోషల్ మీడియాలో కొన్నిచిత్రాలు చక్కర్లు కొట్టాయి. అటువంటి నోటునే ఆర్బీఐ విడుదల చేసింది. తాజాగా రెండు కొత్త రంగుల్లో వెయ్యినోటు రాబోతున్నదంటూ ఆన్ లైన్ లో చిత్రాలు వైరల్ అవుతున్నాయి. కొత్త సంవత్సర కానుకగా ఆర్బీఐ తీసుకొస్తున్నదనే ప్రచారం ఊపందుకుంది. కొత్తనోట్లు బూడిద - ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయంటూ కొందరు సోషల్ మీడియాలో చిత్రాలను పోస్టుచేస్తున్నారు. కేంద్ర ఆర్థికవ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ ఓ సందర్భంలో విభిన్న రంగుల్లో నూతన డిజైన్ తో కొత్త 1000 నోటు తీసుకురానున్నట్టు చెప్పారు. ఆయన వ్యాఖ్యలు తాజా ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. మొత్తంగా కొత్త రంగుల్లో రానున్న రెండువేల నోట్లపై ఇప్పటికే అందరిలో ఆసక్తి నెలకొంది.
ఇదిలాఉండగా ప్రధాని కోరిన 50 రోజుల గడువు ముగిసినా.. యాభై ఒకటో రోజు మొదలైనా.. ఢిల్లీ నుంచి గల్లీ దాకా నోట్ల కష్టాలు తీరలేదు. ఒకటో తారీఖు నుంచి రోజుకు 4500 తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించినా.. పరిస్థితి మారే అవకాశాలు ఉంటాయో లేదోనన్న ఆందోళనతో ఉన్న ప్రజలు.. ఏటీఎంల ముందు పడిగాపులు పడ్డారు. రోజులాగే అనేక ఏటీఎంలు ముఖం చాటేశాయి. కొన్ని ఏటీఎంలు తెరిచిన కొద్ది సేపటికే నగదు నిల్వలు అయిపోయి.. షట్టర్లు దించేశాయి. ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీలు కొత్త సంవత్సరంలోనైనా అమల వుతాయన్న ఆశతో ప్రజలు ఉన్నారు. ఒకటో తేదీ నుంచి ఏటీఎంలలో 4500 తీసుకునేందుకు అనుమతించడం కొంత ఊరటనిచ్చే చర్యేనన్న పలువురు పేర్కొంటున్నారు గతంలో వారానికి రెండుసార్లు క్యూలో నిలబడే బదులుగా ఇప్పుడు కాస్త సమయం కలిసి వస్తుందని భావిస్తున్నారు. అయితే వారానికి ఇచ్చే రూ.24వేలు (సేవింగ్స్ ఖాతా), రూ.50వేలు (కరంట్ ఖాతా) పరిమితిని పెంచకుండా రోజుకు విత్‌డ్రా చేసుకునే మొత్తాన్ని పెంచితే పెద్ద ఉపయోగం ఏమీ ఉండదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/