2021 పార్లమెంట్ బడ్జెట్స్ ..బడ్జెట్‌ లో రైల్వే శాఖకు ఎంత ముట్టబోతుంది!

Update: 2021-01-26 02:30 GMT
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఫిబ్రవరి 1 న సమర్పించనున్నారు. ఇది మోడీ ప్రభుత్వ రెండవ టర్మ్ లో మూడవ బడ్జెట్. బడ్జెట్ సెషన్ మొదటి దశ జనవరి 29 న ప్రారంభమై ఫిబ్రవరి 15 తో ముగుస్తుంది. బడ్జెట్ యొక్క రెండవ సెషన్ మార్చి 8 నుండి ఏప్రిల్ 8 వరకు నడుస్తుంది. రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సెషన్ జనవరి 29 న ప్రారంభం అవుతుంది.

ఫిబ్రవరి 1 న బడ్జెట్ సమర్పించబడుతుంది. బడ్జెట్ సెషన్ రెండవ దశ మార్చి 8 నుండి ఏప్రిల్ 8 వరకు ఉంటుంది. సెషన్లో కోవిడ్ -19 ప్రోటోకాల్‌కు తగిన పరిశీలన చేయనున్నారు. ఈ సంవత్సరం కరోనా వ్యాధి కారణంగా, బడ్జెట్ కాపీల ముద్రణ లేదు. ఇది కాకుండా ఎకనామిక్ సర్వే కాపీ కూడా ముద్రించడం లేదు. ఆర్థిక సమీక్ష జనవరి 29 న పార్లమెంటు వెబ్ సైటులో పెట్టనున్నారు.  

భారత ఖజనాలో కీలకపాత్ర పోషించే రైల్వేలకు ఈ బడ్జెట్ లో ఏ తరహ కేటాయింపు ఉంటాయన్నదానిపై చర్చ మొదలైంది. దేశంలో పెరుగుతున్న నుగుణంగా సదుపాయాల కల్పనతో పాటు అధునీకరణకు ఈసారి 10శాతం అధికంగా కేటాంపులు జరపాలని కేంద్రం ముందుకు భారత రైల్వే శాఖ కొత్త ప్రతిపాదనలు అందినట్లు సమాచారం. వచ్చే బడ్జెట్ నుండి సుమారు 75,000 కోట్ల రూపాయల స్థూల బడ్జెట్ మద్దతు ను రైల్వే మంత్రిత్వ శాఖ డిమాండ్ చేసింది.

 గత బడ్జెట్ ‌లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ రైల్వే కోసం రూ. 70,250 కోట్ల జీబీఎస్‌ ను కేటాయించారు. అదే సమయంలో, రైల్వేలకు 2019-20లో రూ. 69,967 కోట్లు, 2018-19లో రూ. 55,088 కోట్లు జీబీఎస్‌ ప్రకటించారు. వచ్చే ఏడాది మూలధన వ్యయాన్ని 13% పెంచాలని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. రైల్వే తన కాపెక్స్ బడ్జెట్‌ను ఈ ఏడాది రూ .1.6 లక్షల కోట్ల నుంచి రూ .1.8 లక్షల కోట్లకు పెంచాలని ప్రతిపాదించింది.
 
కరోనా పుణ్యామాన్ని లాక్‌ డౌన్ కాలంలో అనేక ప్రాజెక్టులు నిలిచిపోయినప్పటికీ, ఈ సంవత్సరం కాపెక్స్ బడ్జెట్‌ లో సుమారు 1.55 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని భావిస్తోంది. లాక్ ‌డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ప్రయాణీకుల రైళ్లు కూత పెట్టలేదు. గూడ్స్ చేరవేతకు సంబంధించి కొన్ని రైళ్లను మాత్రమే అధికారులు పట్టాలెక్కించారు. ఈ సమయంలో ట్రాక్ ‌లు, ఇతర పనులను పునరుద్ధరించడంపై రైల్వే అధికారులు దృష్టి పెట్టారు.
బిజినెస్ టుడే నివేదిక ప్రకారం, రైల్వే మంత్రిత్వ శాఖ 2021-22 సంవత్సరానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి మొత్తం రూ .1.80 లక్షల కోట్లు డిమాండ్ చేస్తోంది. ఇందులో జిబిఎస్ 75,000 కోట్ల రూపాయలు కాగా, రైల్వే సమర్పించిన మొత్తం మూలధన వ్యయం మునుపటి సంవత్సరం బడ్జెట్ అంచనా కంటే 12.5 శాతం ఎక్కువ. కనీసం 1.70 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ ను ప్రభుత్వం ఆమోదిస్తుందని భావిస్తోంది.

ఇది గత బడ్జెట్‌ తో పోలిస్తే 6 శాతం అధికంగా ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖ భావిస్తోంది. రైల్వే బడ్జెట్‌ లో దృష్టి సారించే విషయాలలో ప్రైవేట్ రైళ్లు, కొత్త రైళ్ల ద్వారా కొత్త మార్గాల్లో వేగంగా ప్రయాణించడం, పర్యాటక ప్రదేశాలకు మెరుగైన కనెక్టివిటీ, సోలార్ ప్యానెల్ ఆధారిత గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇది కాకుండా, కిసాన్ రైల్ సర్వీస్ విస్తరణ, ఈశాన్య రాష్ట్రాల్లో రైలు కనెక్టివిటీపై కూడా దృష్టి పెట్టె అవకాశం ఉంది.
Tags:    

Similar News