అమెరికాలో నల్లజాతీయుడి కాల్పుల్లో తెలుగుబిడ్డ మృతి చెందిన సంగతి తెలిసిందే. మిసోరిలోని కన్సాస్ లో ఓ రెస్టారెంట్ లో దోపిడీ చేయడానికి వెళ్లిన నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో శరత్ చనిపోయిన విషయం తెలిసిందే.జేస్ ఫిష్ అండ్ చికెన్ మార్కెట్ లో కొందరు వ్యక్తులు జరిపిన కాల్పుల్లో శరత్ భుజంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అతన్ని వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ శరత్ చనిపోయాడు. ఐదు రౌండ్ల కాల్పులు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తామంతా పక్క హోటల్లోనే ఉన్నామని, బయటకు వచ్చేలోపు ఆ వ్యక్తులంతా పారిపోయినట్లు చెప్పారు. ఇలా విషాద పరిస్థితుల్లో మృత్యువాత పాలయిన శరత్ విషయంలో అమెరికాలోని పలువురు తమ పెద్ద మనసు చాటుకున్నారు.
అయితే మరణించిన శరత్ కొప్పు కోసం అమెరికా స్పందించింది. ఆయన మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడం కోసం చేపట్టిన క్రౌడ్ ఫండింగ్ కు అనూహ్యమైన స్పందన వచ్చింది. శరత్ కజిన్ రఘు చోడవరం దీనికోసం శనివారం ప్రత్యేకంగా గోఫండ్ మి అనే అకౌంట్ ను క్రియేట్ చేశారు. దీనికి వెల్లువలా విరాళాలు వస్తున్నాయి. కేవలం మూడు గంటల వ్యవధిలోనే 25 వేల డాలర్లు రావడం విశేషం. శరత్ కూడా అందరిలాగే ఎన్నో కలలు కన్నాడని - ఎప్పుడూ నవ్వుతూ - నవ్విస్తూ ఉండే అతడు.. అవసరం ఉన్నవాళ్లకు సాయం చేసేవాడని రఘు చెప్పాడు. కానీ అనుకోకుండా అతని జీవితం ఇలా ముగుస్తుందని ఎవరూ ఊహించలేదని అతను వాపోయాడు. యూనివర్సిటీ ఆఫ్ మిసోరిలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న శరత్.. అక్కడే నివసిస్తూ పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నారు.
మరోవైపు శరత్ ను కాల్చి చంపింది ఇతడే అంటూ అక్కడి పోలీసులు ఓ వీడియో రిలీజ్ చేశారు. అతని సమాచారం ఇస్తే 10 వేల డాలర్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. అనుమాతుడి వీడియోతోపాటు రివార్డు విషయాన్ని కన్సాస్ పోలీసులు తమ ట్విటర్ లో పోస్ట్ చేశారు. దోపిడీ క్రమంలో ఈ హత్య జరిగిందని - జాతి విద్వేష కోణంలో ఎలాంటి అనుమానాలు లేవని మరో విచారణాధికారి వెల్లడించారు.