దేశ అవినీతి చరిత్రలోనే రికార్డు స్థాయి కుంభకోణంగా నిలిచిన 2 జీ స్కాం ఊహించని ముగింపునకు చేరింది. ఈ కేసులో పటియాలా హౌజ్ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. ఈ కేసులో టెలికాం శాఖ మాజీమంత్రి ఎ రాజా - డీఎంకే ఎంపీ కనిమొళి సహా నిందితులందరినీ పటియాలా కోర్టు నిర్దోషులుగా తేల్చింది. కోర్టు తీర్పుతో పటియాలా హౌజ్ కోర్టు ఎదుట డీఎంకే నేతలు, -పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. అయితే పటియాలా హౌస్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ - ఈడీ హైకోర్టులో అప్పీల్ చేయనుంది.యూపీఏ ప్రభుత్వ హయాంలో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే.
2జీ స్పెక్ట్రం అక్రమ కేటాయింపుల వల్ల రూ.1.76 లక్షల కోట్లు నష్టం ఏర్పడినట్లు కేంద్ర ప్రభుత్వానికి కాగ్ ఓ నివేదిక సమర్పించింది. భారీ మొత్తంలో కుంభకోణం కావడంతో సీబీఐ రెండు కేసులు పెట్టింది. దీంతోపాటు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ)మరో కేసు నమోదు చేసింది. సీబీఐ పెట్టిన రెండు కేసుల్లో రాజా, డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి అభియోగాలు ఎదుర్కొన్నారు. వీరితోపాటు టెలికమ్యూనికేషన్స్ మాజీ కార్యదర్శి సిద్దార్థ్ బెహురా - రాజా మాజీ ప్రయివేటు కార్యదర్శి ఆర్‌కే సంతాలియా తదితర 14 మందిపై చార్జిషీటు దాఖలైంది.
పదేళ్ల కిత్రం జరిగిన 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో ఆసక్తికరమైన మలుపులు ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 2004 - 2009లో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సార్లు మిత్రపక్షమైన డీఎంకేకు కేంద్ర మంత్రివర్గంలో ప్రత్యేక ప్రాధాన్యతే దొరికింది. తమకు అవసరమైన మంత్రిత్వ శాఖలను కరుణానిధి పట్టుపట్టి కేంద్రం నుంచి సాధించుకున్నారు. ఇందులో భాగంగానే డీఎంకే ఎంపీ రాజాని టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా ఆ పార్టీ చీఫ్ కరుణానిధి చేశారు. ఈ సమయంలో 2G స్పెక్ట్రం కేటాయింపుల్లో భారీ అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ఈ ఆరోపణలపై కాగ్ విచారణ జరిపి 2జీ స్పెక్ట్రం అక్రమ కేటాయింపులతో లక్షా 76 వేల కోట్లు నష్టం జరిగిందని కేంద్రానికి కాగ్ నివేదిక ఇచ్చింది. భారీ మొత్తంలో కుంభకోణం కావడంతో సీబీఐ రెండు కేసులు పెట్టింది. ఎన్ ఫోర్సుమెంటు డైరక్టరేట్ మరో కేసు నమోదు చేసింది. సీబీఐ పెట్టిన రెండు కేసుల్లో రాజా - డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె - రాజ్యసభ సభ్యురాలు కనిమొళి నిందితులు. వీరితోపాటు టెలికమ్యూనికేషన్స్ మాజీ కార్యదర్శి సిద్దార్థ్ బెహురా - రాజా మాజీ ప్రైవేట్ కార్యదర్శి ఆర్ కే సంతాలియా తదితర 14 మందిపై చార్జిషీటు ఫైల్ అయింది.
స్వాన్ టెలికం సంస్థకు 2G స్పెక్ట్రం కేటాయింపులకు ప్రతిఫలంగా కలైంజర్ టీవీ - టీపీ గ్రూపు సంస్థలకు 2వందల కోట్లు లంచం ఇచ్చిన కేసును కూడా ఈకేసులోనే చేర్చింది సీబీఐ. ఈ కేసులను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేకకోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీ విచారణ చేపట్టారు. రిలయన్స్ టెలికం - స్వాన్ టెలికం - యూనీటెక్ వైర్ లెస్ సంస్థలు కూడా కేసు విచారణలను ఎదుర్కొన్నారు. కలైంజర్ టీవీ డైరక్టర్ గా ఉన్న కరుణనిధి సతీమణి దయాళుఅమ్మాళ్ ను కూడా సీబీఐ ప్రశ్నించాలని చూసింది. అయితే అనారోగ్య కారణాలతో ఆమెకు జ్ఞాపకశక్తి పూర్తిగా పోయిందని, ఏమీ మాట్లాడుతారో ఆమె తెలియదని కరుణ కుటుంభ సభ్యులు విచారణకు నిరాకరించారు. సీబీఐ సిఫార్సుతో కేంద్రం నుంచి వచ్చిన డాక్టర్లు చెన్నైకి వచ్చి దయాళుఅమ్మాళ్ ను పరీక్షించారు. మరోవైపు 2జీ కేసులో కాంగ్రెస్ వైఖరీకి నిరసనగా యూపీఏ నుంచి డీఎంకే వైదొలిగింది.
ఆరేళ్లుగా సాగిన ఈ కేసు విచారణ ఈ ఏడాది ఏప్రిల్ 26న ముగిసింది. నవంబర్ ఏడున తీర్పు ఇస్తామని కోర్టు ప్రకటించింది. సరిగ్గా తీర్పుకు రెండు రోజుల ముందు.. నవంబర్ 5న చెన్నై పర్యటనలో ప్రధాని మోడీ కరుణానిధీతో సమావేశమయ్యారు. ఇదే సమయంలో మోడీ - కరుణా భేటీపై అనేక అరోపణలు వచ్చాయి. కేసును మరింతగా స్టడీ చేయాల్సి ఉందని తీర్పును కోర్టు వాయిదా వేసింది. తాజా వెలువడిన తీర్పులో రాజా - కనిమొళిని నిర్దోషులుగా ప్రత్యేకకోర్టు తేల్చింది.