బెంగళూరులో ఏరో ఇండియా నిర్వహిస్తున్న ఎయిర్ షో ముహుర్తం అస్సలు బాగోనట్లుగా ఉంది. ఈ షో ప్రారంభానికి ముందు రెండు ఎయిర్ ఫోర్స్ విమానాలు ఎదురెదురుగా ఢీ కొనటం.. పెను ప్రమాదం చోటు చేసుకోవటం తెలిసిందే. ఈ విషాద ఘటన నుంచి బయటకు రాక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ వైమానిక ప్రదర్శన జరుగుతున్న యలహంక ఎయిర్ బేస్ స్టేషన్ సమీపంలో భారీ ఆగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 300 లకు పైగా కార్లు.. పెద్ద ఎత్తున బైకులు ఆగ్నికి ఆహుతి అయ్యాయి. ఆగ్నిప్రమాదం మంటల్ని ఆపేందుకు ఆగ్నిమాపక అధికారులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.
దాదాపు పదికి పైగా ఫైరింజన్లు రంగంలోకి దిగి పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పార్కింగ్ స్థలంలో పెద్ద ఎత్తున కార్లు.. బైకుల్ని ఉంచారు. ఇక్కడ మంట రాజుకుంది. అయితే.. మంట ఎలా పుట్టిందన్న దానిపై స్పష్టత రావటం లేదు. ఈ పార్కింగ్ కు దగ్గర్లోనే కొన్ని విమానాల్ని ఉంచినట్లుగా తెలుస్తోంది. మంటలు విస్తరించకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి.