విశాఖలో రాజధానికి 3వేల ఎకరాలు రెడీ

Update: 2019-12-25 07:20 GMT
ఏపీకి విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా చేయాలని దాదాపు నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ దీనిపై ఈనెల 27న అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిసింది. 27న జరిగే కేబినెట్ భేటి అనంతరం అధికారికంగా ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే కేబినెట్ భేటిలో దీనికి సంబంధించిన నోట్ సిద్ధమైందని.. మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు అందినట్టు తెలిసింది.

ఇక ఏపీ పరిపాలన రాజధానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పాలనా రాజధానికి ప్రాథమికంగా 3వేల ఎకరాలు సరిపోతాయని జిల్లా అధికారులు భావిస్తున్నారు.

విశాఖ నగరంలోని ముడసర్ లోవ ప్రాంతంతోపాటు విశాఖ రూరల్ - భీమునిపట్నం - ఆనందపురం - సబ్బవరం - పెందుర్తి మండల్లాల్లోని భూములను రాజధానికి కేటాయించే అవకాశం ఉందని సమాచారం. దాదాపు 3వేల ఎకరాలను సేకరించడానికి అనుగుణంగా అధికారులు స్థలాల పరిశీలన చేస్తున్నారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టును అనకాపల్లి నుంచి భోగాపురం వరకు నిర్మించాలని యోచిస్తున్నారు.
   

Tags:    

Similar News