ఐరెన్ బాక్స్ తో కాల్చేసిన గాళ్ ఫ్రెండ్

Update: 2015-12-18 22:30 GMT
ఒక గాళ్ ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ మీద ప్రతీకారం తీర్చుకోవటం కోసం అనుసరించిన వైనం హడలు పుట్టించటమే కాదు.. షాకింగ్ అనిపించక మానదు. చిన్న.. చిన్న గొడవకే మరీ అంత సైకోలా వ్యవహరించాలా అనిపించేలా చేసిన ఈ అమ్మడు.. బాయ్ ఫ్రెండ్ జీవితాన్ని అంధకారం చేయటంతో పాటు.. తాను జైలుపాలైంది.

నైజీరియాకు చెందిన కెన్యా అనే 30 ఏళ్ల చిన్నది లండన్ లో చదువుకోవటానికి వచ్చింది. బుద్దిగా చదువుకోకుండా యాష్లీ అనే బాయ్ ఫ్రెండ్ తో ఏడాపెడా తిరిగేసింది. ఇద్దరూ కలిసి బోలెడన్ని సార్లు సెక్స్ చేసేశారు కూడా. అయితే.. ఏడు నెలలుగా వారి మధ్య లెక్క తేడా కొట్టింది. సరిగా మాట్లాడుకోవటం మానేశారు. ఈ గొడవను మనసులో పెట్టుకొని అతగాడి మీద పగ తీర్చుకోవాలని భావించింది.

మళ్లీ అతగాడితో మాట కలిపిన కెన్యా.. తన  ఇంటికి పిలిచింది. సెక్స్ కు ఓకే చేయించింది. నగ్నంగా తయారై.. శృంగారం సాగుతున్న వేళ.. అప్పటివరకూ  ఐరన్ చేసి ఉంచిన ఐరెన్ బాక్స్ ను ఒక్క ఉదుటున బాయ్ ఫ్రెండ్ అంగం మీద ఉంచేసింది. దీంతో గగ్గోలు పెట్టేస్తున్న అతగాడిని అక్కడే వదిలేయటమే కాదు.. తన బ్యాగ్ లో దాచుకున్న పగిలిన గాజు ముక్కతో అంగం మీద గుచ్చేసి చక్కా పోయింది.

అతగాడి హాహాకారాలు విన్న చుట్టుపక్కల వారు వెనువెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సీన్లోకి ఎంటరై వివరాలు సేకరించి.. కెన్యా డిటైల్స్ లోకి వెళ్లారు. ఆమెను వెతకటం మొదలెట్టారు. బాయ్ ఫ్రెండ్ మీద పాశవికంగా దాడి చేసిన ఆమె.. తన దేశానికి వెళ్లేందుకు ఎయిర్ పోర్ట్ లో విమానం కోసం ఎదురుచూస్తున్న వేళ.. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తన స్టూడెంట్ ముగిసే సమయంలో ఆమె ఇలాంటి చర్యకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. కోర్టు ఆమెకు తొమ్మిదేళ్ల జైలుశిక్షను విధించగా.. ఆసుపత్రిలో ఉన్న యాప్లీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడట.
Tags:    

Similar News