కరోనా కాలంలో మాస్క్ ధరించడం నిత్యకృత్యమైంది. రెండేళ్లుగా ప్రతిఒక్కరూ మాస్కును తమ జీవితంలో భాగం చేసుకున్నారు. మరికొంతమంది తమదైన రీతిలో ధరిస్తూ వార్తల్లో నిలిచారు. దీని తయారీని ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పారు. కాగా 35 కేజీల బరువైన మాస్క్ ను తయారు చేశారు కొందరు. ప్రపంచ రికార్డు పొందిన ఆ మాస్క్ విశేషాలేంటో తెలుసుకుందాం రండి.
జపాన్ లోని కుషిమా ప్రిపెక్చర్ ప్రాంతంలోని 57 మీటర్ల ఎత్తున్న బౌద్ధ మాత విగ్రహానికి మాస్క్ ధరింపజేయాలని అక్కడి ప్రజలు నిర్ణయించుకున్నారు. అందుకనుగుణంగా 5.3మీటర్ల పొడవు, 4.1 మీటర్ల వెడల్పు కలిగిన 35 కేజీల మాస్క్ ను తయారు చేశారు. దీనిని ఆ మాత విగ్రహానికి ధరింపజేశారు. అంతేకాకుండా కరోనా మహమ్మారి నుంచి తమను కాపాడాలని మాతను వేడుకున్నారు.
ఆ బౌద్ధ మాత విగ్రహం 33 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. 57 అడుగుల ఎత్తులో ఉన్న మాతకు మాస్క్ ధరింపజేయడానికి నలుగురు వ్యక్తులు ప్రయత్నించారు. మూడు గంటల పాటు కష్టపడి తాళ్ల సాయంతో మాస్క్ తొడిగారు. కరోనా కాలంలో మాస్క్ ధరింపజేయడం బౌద్ధ మాత విగ్రహానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. మాత చేతిలో చంటి బిడ్డ ఉంది. కాగా త్వరలో రాబోయే ప్రమాదం నుంచి తమ పిల్లల్ని కాపాడాలని వేడుకున్నారు.
జపాన్ లో నిత్యం భూకంపాలు వస్తాయి. కాగా ప్రకృతి విపత్తుల నుంచి కాపాడాలని జపనీయులు అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రస్తుతం కరోనా పీడ తొలగించాలని వేడుకుంటున్నారు. మహమ్మారి నుంచి తమ చిన్నారులను రక్షించాలంటూ మాతకు ప్రార్థనలు చేస్తున్నారు. 187 అడుగుల ఎత్తైన ఆ విగ్రహానికి 35 కేజీల మాస్క్ ధరింపజేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. సామాజిక మాధ్యమాల్లో ఇవి చక్కర్లు కొడుతున్నాయి.